మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

రేగొండ: ఆర్థిక కారణాలతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్ప డింది. ఈ ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జోగయ్యపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై సుధాకర్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సూర సరోజన (55) వ్యవసాయ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక పరిస్థితులతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు పరకాలలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement