ప్రయాణంలో జరపైలం | - | Sakshi
Sakshi News home page

ప్రయాణంలో జరపైలం

May 4 2026 6:49 AM | Updated on May 4 2026 6:49 AM

ఖిలా వరంగల్‌: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో చాలామంది కుటుంబ సమేతంగా విహారయాత్రలు, బంధువుల ఇళ్లు, స్వగ్రామాలకు వెళ్తున్నారు. దీంతో వారం రోజులుగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు ఆర్పీఎప్‌, జీఆర్పీ అధికారులు. ప్రధానంగా రైలు ప్రయాణాల్లో ఎక్కువగా చోరీలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యలో ఆయా శాఖల అధికారులు ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో రైల్వే రక్షణ దళం(ఆర్పీఎఫ్‌) ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) ఇన్‌స్పెక్టర్‌ సురేందర్‌ సంయుక్తంగా కొద్దిరోజులుగా రైలు ప్రయాణ భద్రతపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో ఆర్పీఎఫ్‌, జీఆర్పీ అధికారులు రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌లపై గస్తీ ముమ్మరం చేశారు.

139కు ఫిర్యాదు చేయండి

ప్రయాణంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే రైలులో విధుల్లో ఉండే సిబ్బందికి తెలపాలి. వారు కనిపించపోయినా, పట్టించుకోకపోయినా వెంటనే 139 నంబరకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలి. మీ వివరాలకు అనుగుణంగా సమీప రైల్వే స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. రైల్వే యాప్‌ల్లో కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ప్రయాణికులకు పలు సూచనలు..

రైల్వే స్టేషన్‌కు రైలు వచ్చేటప్పుడు,

వెళ్లేటప్పుడు ఎక్కే వారిని, దిగే వారిని

గమనిస్తూ ఉండాలి.

బంగారు ఆభరణాలు, ఎక్కువ మొత్తంలో నగదు ఇతర విలువైన వస్తువులు వెంట

తీసుకెళ్లకూడదు.

అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులను గుర్తిస్తే రైల్వే రక్షణ దళం సిబ్బందికి సమాచారం

అందించాలి.

తోటి ప్రయాణికులు ఎవరైనా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే ఆర్పీఎఫ్‌ లేదా రైల్వే టీసీకి ఫిర్యాదు చేయాలి.

రైలులో ప్రయాణిస్తూ రాత్రి సమయాల్లో సెల్‌ఫోన్లు చార్జింగ్‌లో పెట్టుకుని

వదిలేయకూడదు.

పిల్లలను రైలు తలుపుల దగ్గర

తిరగనివ్వకూడదు.

అపరిచితులతో తక్కువగా మాట్లాడాలి.

వారు ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవద్దు.

ఇతరులకు వ్యక్తిగత సమాచారం చెప్పొద్దు.

వేసవి సెలవులతో

జనం విహారయాత్రలు

రైలు, బస్సుల్లో చోరీలు జరిగే అవకాశం

ఆర్పీఎఫ్‌, జీఆర్పీ అధికారుల అవగాహన

అపరిచితులతో అప్రమత్తంగా

ఉండాలని సూచన

Advertisement
 
Advertisement
Advertisement