ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి | - | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి

May 3 2026 7:17 AM | Updated on May 3 2026 7:17 AM

ఆస్పత్రిలో మెరుగైన వైద్య సేవలందించాలి

ఆర్డీఓ కార్యాలయాల్లోనూ ప్రజావాణి

హన్మకొండ చౌరస్తా: ఆస్పత్రికి వచ్చే గర్భిణి, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ అన్నారు. హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం శనివారం ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌.. ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ బిల్లులు, సర్జికల్‌ ఐటమ్స్‌, మెడిసిన్స్‌, ఆస్పత్రి నిర్వహణ, బడ్జెట్‌, కావాల్సిన వనరులు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అన్ని మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రధాన భవనానికి రంగులు వేసేందుకు ప్రతిపాదనలు అందించాల ని సూచించారు. వెయిటింగ్‌ హాల్‌, బిల్డింగ్‌ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని సిద్ధమైతే రోగుల సహా యకులకు ఉపయోగపడుతుందని, ఆరోగ్యశ్రీ కేసుల సంఖ్య పెరిగేలా చూడాలని సూచించారు. సమావేశంలో జీఎంహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అడిషనల్‌ డీఎంఈ రాజలింగం, కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సంధ్య, ఐఎంఏ బాధ్యులు డాక్టర్‌ రాధిక, వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ఇకనుంచి రెవెన్యూ డివిజన్‌ స్థాయిలోనూ సమర్థంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశాలు జారీ చేశారు. ప్రతీ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న మాదిరిగా రెవెన్యూ (ఆర్డీఓ) కార్యాలయాల్లోనూ నిర్వహించాలని సూచించారు. ప్రజలనుంచి దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కారమయ్యే విధంగా చూడాలని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement