జిల్లాకు స్పోర్ట్స్‌ స్కూల్‌ తెచ్చిన ఘనత మాదే.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు స్పోర్ట్స్‌ స్కూల్‌ తెచ్చిన ఘనత మాదే..

May 3 2026 7:17 AM | Updated on May 3 2026 7:17 AM

జిల్లాకు స్పోర్ట్స్‌ స్కూల్‌ తెచ్చిన ఘనత మాదే..

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

జేఎన్‌ఎస్‌లో వేసవి శిక్షణ

శిబిరం ప్రారంభం

వరంగల్‌ స్పోర్ట్స్‌: గత ప్రభుత్వం వరంగల్‌ క్రీడాభివృద్ధిని 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్తే జిల్లాకు స్పోర్ట్స్‌ స్కూల్‌ తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్‌దే అని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో నెల రోజులపాటు కొనసాగనున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని శనివారం సాయంత్రం ఎమ్మెల్యే నాయిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేసవిలో 21 క్రీడాంశాల్లో శిక్షణ అందిస్తోందని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 350 మంది శిక్షణకు పేర్లు నమోదు చేసుకోవడం అభినందనీయమన్నారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ కార్యదర్శి బైరబోయిన కై లాస్‌యాదవ్‌, తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వివిధ క్రీడా సంఘాల బాధ్యులు శ్యామల పవన్‌కుమార్‌, తోట శ్యామ్‌ప్రసాద్‌, దుబాకీ సంతోష్‌, ఎర్రగట్టు స్వామి, మర్కాల యాదిరెడ్డి, ఎ.సాంబయ్య, లిల్లీ ఫ్లోరెన్స్‌, ఎన్‌.శ్రీధర్‌, డీఎస్‌ఏ కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement