హన్మకొండ అర్బన్: మాతృత్వానికి మరో మార్గం చట్టబద్ధమైన దత్తత అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అడాప్షన్ డ్రైవ్స్ ఫాస్టర్ కేర్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా.. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో అడాప్షన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు, ‘ఊయల ’ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, డీఆర్డీఓ మేన శ్రీను, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, సీడీపీఓ స్వరూప, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్ అధికారి ప్రవీణ్‌కుమార్, శిశు గృహ మేనేజర్ మాధవి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్, సోషల్ వర్కర్ సంగి చైతన్య, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక, హబ్ కో–ఆర్డినేటర్ కళ్యాణి, చైల్డ్ హెల్ప్‌లైన్ జయవర్ధన్, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
చట్ట విరుద్ధమైన దత్తతను అరికట్టాలి
కాళోజీ సెంటర్: చట్ట విరుద్ధమైన దత్తతను ప్రోత్సహించడం నేరమని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం దత్తత సహాయ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించి ఆమె ప్రారంభించి మాట్లాడారు. దత్తత సమాచారం తెలపడం, అనుమానాలను నివృత్తి చేయడం కోసం ఈ కేంద్రం ప్రతి సోమవారం పనిచేస్తుందని తెలిపారు. చట్ట విరుద్ధమైన దత్తతను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యరాణి, వైవీ గణేశ్, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ రాజమణి, బీఆర్‌బీ భవన్ కో–ఆర్డినేటర్ ఉమ తదితరలు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్‌పాయ్


