హన్మకొండ అర్బన్: జిల్లాలోని సంక్షేమ గురుకులాలు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన సమీక్షలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. గురుకులాలు, హాస్టళ్లలో తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, టాయిలెట్ సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, జిల్లా రెవెన్యూ అధికారి సత్యపాల్‌రెడ్డి, ఆర్డీఓ రాథోడ్ రమేశ్, డీఈఓ గిరిరాజ్ గౌడ్ పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలి
విద్యార్థులు భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి ఆదర్శంగా నిలవాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన జిల్లాలోని తొమ్మిది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. మడికొండ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థి కె.అలేఖ్య 571 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించగా.. కలెక్టర్ ఆమెను సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా సమన్వయ అధికారి ఉమామహేశ్వరి, వివిధ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల ప్రిన్సి పాళ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్


