ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని వడ్డేపల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 60వ డివిజన్ పరిధిలో అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ డివిజన్‌లో దవాఖాన, శ్మశానవాటిక, రహదారులు, డ్రెయినేజీల వంటి మౌలిక సదుపాయాలు దశలవారీగా చేపడుతున్నామని పేర్కొన్నారు. వడ్డేపల్లి, శాయంపేట, సోమిడి ప్రాంతాలను నగరంలోని ప్రధాన కాలనీలకు సమానంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పాల్గొన్నారు.
ఆరోగ్యంపై అవగాహన అవసరం
ఎంపీ కడియం కావ్య
మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన అంశాలపై సమగ్ర అవగాహన కల్పించడం అత్యంత అవసరమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సురక్షిత మాతృత్వ దినోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. గర్భధారణకు ముందే ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగంపై అవగాహన పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తల్లి, శిశు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాతృత్వానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు.


