ఒకరి అరెస్ట్, పరారీలో మరో ఇద్దరు
హసన్‌పర్తి: హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చింతగట్టు శివారులోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో ఏర్పాటు చేసిన డంప్‌లో పెద్దఎత్తున రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయనే పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించింది. సుమారు రూ.7 లక్షల విలువైన రేషన్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ప్రధాన నిందితుడైన హసన్‌పర్తికి చెందిన ఓర్సు భానును అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హుజూరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన మౌటం మధుకర్, భీమదేవరపల్లి మండలం ముల్కనూరుకు చెందిన చిత్తారి ఎర్రగట్టు పరారీలో ఉన్నట్లు వివరించారు. దాడిలో ఇన్‌స్పెక్టర్ జి.బాబులాల్, ఏఎస్సై కె.సుధాకర్, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.


