ఖిలా వరంగల్: నళ్ల రాతిలో ఆనాటి శిల్పులు చెక్కిన కళా ఖండాలు మహా అద్భుతంగా ఉన్నాయని అసిస్టెంట్ సెక్షన్ అధికారులు కొనియాడారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు పర్యాటక ప్రాంతాల సందర్శనలో భాగంగా ఖిలా వరంగల్ కోటను బుధవారం సందర్శించారు. వారికి కాకతీయ చరిత్ర, విశిష్టత గురించి కోట గైడ్ దేనబోయిన రవి యాదవ్ వివరించారు. అనంతరం అధికారులు ఖుష్‌మహాల్, రాతి, మట్టికోట అందాలను తిలకించారు. కార్యక్రమంలో టూర్ కోఆర్డినేటర్ బాలాజీ, ఆనంద్, కోర్స్ డైరెక్టర్ బాలాజీ, కిరణ్‌కుమార్, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


