ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హన్మకొండ అర్బన్: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ప్రతీ అర్హుడికి సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా హనుమకొండ, కాజీపేట మండలాలకు చెందిన 226 మందికి రూ.2,26,26,216 విలువైన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అదేవిధంగా 176 మందికి రూ.53,25,500 విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు.
హన్మకొండ అర్బన్: సుదీర్ఘకాలం ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేసిన అధికారులు, ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనేది ముగింపు కాదని, కొత్త జీవనానికి శ్రీకారం అని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాలరాజు, కలెక్టరేట్ ఉద్యోగి సమ్మయ్యను కలెక్టర్ శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రవి, అధికారులు, సహోద్యోగులు పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలి..
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామసభల ద్వారా ప్రజలకు విస్తృతంగా తెలియజేసి, విజయవంతంగా అమలు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో నేడు (గురువారం) నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ ఎన్.రవి, డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంత్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
మౌలిక వసతులు కల్పించాలి..
కాజీపేట అర్బన్: న్యూశాయంపేటలోని డబుల్ బెడ్ రూం ఇళ్లలో మౌలిక వసతుల కల్పన వేగంగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కాజీపేట మండలం న్యూశాయంపేటలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను బుదవారం కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్ ఆకస్మికంగా చేశారు. కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, జీడబ్ల్యూఎంసీ సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ సురేశ్‌బాబు, పీడీ సిద్ధార్థ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ: అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ మృతి ఘటనలో ఇద్దరు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఉద్యోగులను బుధవారం సస్పెండ్ చేశా రు. టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ యాదవనగర్ సెక్షన్‌కు చెందిన అన్‌మ్యాన్డ్ డిస్ట్రిబ్యూషన్ వర్కర్ గాదె పున్నం చందర్ సోమవా రం నిచ్చెన సాయంతో స్తంభం ఎక్కి విద్యుత్ సర్వీస్ డిస్‌కనెక్ట్ చేస్తుండగా షాక్‌కు గురై కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనకు యాదవనగర్ సెక్షన్ లైన్ ఇన్‌స్పెక్టర్ డి.వేణు, లైన్‌మెన్ జి.శ్రీనివాస్‌రావును బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేశారు. ఈమేరకు ఎన్పీడీసీఎల్ హనుమకొండ టౌన్ డీఈ జి.సాంబరెడ్డి మెమో జారీ చేశారు.


