కాజీపేట: పట్టణంలో బుధవారం మధ్యాహ్నం చైన్‌స్నాచింగ్ జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడ నుంచి దుండగులు పుస్తెల తాడు అపహరించారు. బాధితురాలి కథనం ప్రకారం.. ఐలోని ధనలక్ష్మి వ్యక్తిగత పనులు పూర్తి చేసుకున్న అనంతరం నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. ఈ సమయంలో బైక్‌పై వెనుక నుంచి వచ్చిన దుండగులు ఆమె మెడలోంచి 3 తులాల పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు కేకలు వేయగా స్థానిక యువకులు నిందితులను పట్టుకోవడానికి యత్నించగా తప్పించుకున్నారు. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసు అధికారులతో పాటు క్రైం పార్టీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని విచారణను వేగవంతం చేశారు.
జల్లెడ పడుతున్న పోలీసులు..
నిందితుల ఆచూకీ కోసం పోలీసులు అన్ని రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నా రు. ఇటీవల పట్టణంలో రెండు దఫాలుగా చైన్ స్నా చింగ్‌లకు పాల్పడిన ముఠాకు సంబంధం ఉండి ఉంటుందనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
మహిళ మెడలో నుంచి
3 తులాల పుస్తెలతాడు అపహరణ
రంగంలోకి క్రైం పార్టీ పోలీసులు


