పన్ను వసూళ్లలో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

పన్ను వసూళ్లలో వేగం పెంచండి

Mar 25 2026 7:52 AM | Updated on Mar 25 2026 7:52 AM

పన్ను వసూళ్లలో వేగం పెంచండి

బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

వరంగల్‌ అర్బన్‌: క్షేత్రస్థాయిలో పన్ను వసూళ్లలో వేగం పెంచాలని హనుమకొండ కలెక్టర్‌, బల్దియా కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం నగర పరిధి 54వ డివిజన్‌ పరిధి కేయూసీ రోడ్డు సమీపంలో కలెక్టర్‌ ఆకస్మికంగా సందర్శించి పన్ను వసూళ్ల తీరును పరిశీలించారు. అనంతరం గృహ వినియోగదారుడు చెల్లించిన పన్ను సంబంధ రసీదును కలెక్టర్‌ చెల్లింపుదారుడికి అందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ నరేశ్‌, వార్డు ఆఫీసర్‌ జెస్సీ ప్రియదర్శిని, బిల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement