విజయవాడలోని గాల రైల్వే డిపోను వరంగల్‌కు తరలించాలని కాజీపేట రైల్వే రన్నింగ్‌స్టాఫ్ జేఏసీ, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు కోరారు. ఈ మేరకు మంగళవారం సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సి.హెచ్.శంకర్‌రావు, జోనల్ ప్రెసిడెంట్ కాల్వ శ్రీనివాస్, సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్‌కు సికింద్రాబాద్‌లో వినతి పత్రం అందజేశారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి సౌత్ ఈస్ట్‌కోస్ట్ రైల్వే విభజన కానున్న నేపథ్యంలో అన్ని క్రూ లింక్‌లను వరంగల్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌యాదవ్, జేఏసీ కన్వీనర్ ఎం.రమేశ్, నాయకులు సంగ రమేశ్, ఆర్.రమేశ్, ఎస్.మహేశ్, ఎం.నరేశ్, తదితరులు పాల్గొన్నారు.


