ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

Mar 25 2026 7:52 AM | Updated on Mar 25 2026 7:52 AM

న్యూశాయంపేట: మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పెట్రోల్‌బంకు కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా)అధ్వర్యంలో ఆర్థిక సాధికారతకు ఇందిరా మహిళాశక్తి వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమన్నారు. పెట్రోల్‌ బంకుల నిర్వహణలో పారదర్శకత పాటించాలని కోరారు. అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, ఎల్‌డీఎం రాజు, మెప్మా పీడీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement