న్యూశాయంపేట: ఆశవర్కర్లకు అండగా ఉంటామని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని బీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు జి.యువరాజు, ఆశ వర్కర్ల సంఘం జిల్లా అధ్యక్షురాలు కె.లలిత ఆధ్వర్యంలో ఏకశిల పార్కు నుంచి భారీ ప్రదర్శనగా వచ్చి మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాకు సుదర్శన్‌రెడ్డి మద్దతు తెలిపి మాట్లాడారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశ వర్కర్లకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం ప్రభుత్వ పట్టింపులేనితనానికి నిదర్శనమన్నారు. ధర్నాలో యూనియన్ నాయకులు బి.మంజుల, ఎన్.రవి, పి.రమేశ్, మహేశ్వరి, సంధ్య, లత, అనిత, సాలమ్మ, వసుమతి, మంజుల, సునీత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


