రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
వరంగల్: రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని దృఢంగా నమ్మిన దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. 24 గంటల ఉచిత విద్యుత్, గిట్టుబాటు ధర, సబ్సిడీ విత్తనాల పంపిణీ, ఇండస్ట్రీయల్ పాలసీని తీసుకొచ్చారన్నారు. దీని వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులు మార్కెట్‌కు నాణ్యమైన పత్తిని తీసుకొచ్చి గరిష్ట ధర పొందాలన్నారు. పత్తిని అమ్ముకునే రైతులు కిసాన్ కపాస్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని ఆయా మిల్లుల్లో కేటాయించిన తేదీల్లో విక్రయించాలన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే 1800 599 5779 టోల్ ఫ్రీ నంబర్, 88972 81111 వాట్సాప్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. అనంతరం మార్కెట్‌లోని అపరాల యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, సీసీఐ జీఎం మోహిత్ శర్మ, మార్కెటింగ్ శాఖ డీడీ పద్మావతి, జిల్లా మార్కెటింగ్ అధికారి సురేఖ, డీసీ నీరజ, కాటన్ కొనుగోలు అధికారి కృష్ణారెడ్డి, వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వేద ప్రకాశ్, కాటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చింతలపల్లి వీరారావు, పండ్ల మార్కెట్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు వెల్ది సాంబయ్య, గ్రేడ్ –2 కార్యదర్శి రాము, తదితరులు పాల్గొన్నారు.
మెట్ల బావిని పరిరక్షించుకోవాలి..
ఖిలా వరంగల్ : వరంగల్ శివనగర్‌లోని చారిత్రక ప్రసిద్ధి చెందిన మెట్ల బావిని మహానగర పాలక సంస్థ ఆధ్వర్యంలో సుందరీకరణ, లైటింగ్, అభివృద్ధి పనులు చేపట్టారు. సోమవారం ముఖ్య అతిథిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మెట్ల బావిని పునఃప్రారంభించి మాట్లాడారు. మెట్ల బావిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధిని మంత్రి సురేఖ బావిలోకి దిగి పరిశీలించారు. కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, తహసీల్దార్ ఇక్బాల్, కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, గోపాల నవీన్‌రాజు, శామంతుల శ్రీనివాస్ పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి
కొండా సురేఖ
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..


