వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల ఆలయ అభివృద్ధిలో భాగంగా దేవాలయ ప్రాంగణంలో గార్డెన్, సెంట్రల్ లైటింగ్, భూగర్భ డ్రెయినేజీలను ఏర్పా టు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నామని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సోమవారం సుబ్రహ్మణ్యంతోపాటు హంపీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ నిఖిల్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ కృష్ణచైతన్య వేయిస్తంభాల దేవాలయాన్ని సందర్శించి పరిశీలించారు. రుద్రేశ్వరస్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, జోగులాంబ దేవాలయం కన్జర్వేటర్ అసిస్టెంట్ మల్లేశం, వరంగల్ కేంద్ర పురావస్తుశాఖ కన్జర్వేటర్ అసిస్టెంట్ అజిత్ పాల్గొన్నారు.
కార్తీక సోమవారం పూజలు
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా వే యిస్తంభాల గుడిలో రుద్రేశ్వరస్వామి వారికి ప్రత్యే క పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణ వ్ నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 8గంటలకు మహాహారతి శోభాయమానంగా నిర్వహించారు. ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.
కోట సందర్శన..
ఖిలా వరంగల్: ఖిలావరంగల్ కోటను సోమవారం కేంద్ర పురావస్తుశాఖ మాన్యుమెంట్ డైరెక్టర్ సుబ్ర హ్మణ్యం, అధికారులు సందర్శించారు. భవిష్యత్తుల చేపట్టనున్న నిర్మాణాల శైలిని డైరెక్టర్‌కు అధికారులు వివరించారు. ఆయనవెంట టీజీ టీడీసీ ఇన్‌చార్జ్ అజయ్ ఉన్నారు.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఏఎంవీ సుబ్రహ్మణ్యం
ఆలయాన్ని పరిశీలించిన పురావస్తుశాఖ అధికారులు


