‘లక్కు.. కిక్కు’ దక్కింది!
సాక్షి ప్రతినిధి వరంగల్/కాజీపేట అర్బన్ :
వరంగల్ అర్బన్(హనుమకొండ)జిల్లాలోని 67 వైన్స్‌కు కలెక్టర్ స్నేహ శబరీష్ స్థానిక అంబేడ్కర్ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో టోకెన్ల తీసి దరఖాస్తుదారులకు వైన్స్‌లు కేటాయించారు. ఉదయం 11 గంటలకు లక్కీ డ్రా చేపట్టాల్సి ఉండగా ఆలస్యంగా 12.32 నిమిషాలకు ప్రారంభమైంది. దాదాపు గంటన్నర పాటు దరఖాస్తుదారులు వైన్స్ వస్తుందా రాదా అంటూ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలోని 67 వైన్స్‌కు టెండర్ల చివరి తేది 23వ నాటికి 3,175 దరఖాస్తులు రాగా, లక్కీ డ్రాలో వైన్స్ దక్కించుకున్న వారు ‘లక్కు కిక్కు’లో తేలగా దక్కనివారు నిరాశతో వెనుదిరిగారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ అంజన్‌రావు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కాజీపేట, హనుమకొండ, వరంగల్ అర్బన్, ఖిలా వరంగల్ ఎకై ్సజ్ సీఐలు చంద్రమోహన్, దుర్గాభవా నీ, ప్రభాకర్‌రెడ్డి, రాజు, ఎస్సైలు పాల్గొన్నారు.
నిరాశలో 3,108 మంది దరఖాస్తుదారులు
జిల్లాలోని 67 వైన్స్‌గాను రెండేళ్ల కాలపరిమితితో గత నెల 25న ప్రభుత్వం టెండర్లు ప్రకటించి ఈ నెల 23వ తేదీని చివరి తేదీగా ఖరారు చేసింది. రూ.3 లక్షల నాన్ రీఫండబుల్ ఫీజును నిర్ణయించగా 3,175 మంది దరఖాస్తు చేసుకున్నారు. సోమవారం నిర్వహించిన లక్కీ డ్రాలో 67 మందికి వైన్స్ రాగా, 3,108మంది నిరాశతో వెనుదిరిగారు. పదు ల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించిన సిండికేట్‌రాయుళ్ల పాచికలు ఫలించలేదు. ఫీజు రూపేణా ప్రభుత్వ ఖజానాకు రూ.95.2 కోట్ల ఆదాయం సమకూరింది. కాజీపేట పరిధిలోని కడిపికొండ వైన్స్‌కు 116 దరఖాస్తులు రాగా, అత్యల్పంగా హనుమకొండ ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలోని కమలాపూర్ వైన్స్‌కు 21 వచ్చాయి. కాగా, కడిపికొండ వైన్స్ ఎందరు దరఖా స్తు చేసుకున్నా మాదే అంటూ గత నిర్వాహకులే చేజి క్కించుకోవడం గమనార్హం. కాగా, వైన్స్ దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి నూతనషాపులు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. తాము కోరుకున్న స్థలంలో దుకాణం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.
వరంగల్ జిల్లాలో...
ఖిలా వరంగల్: వరంగల్ జిల్లాలో మద్యం షాపుల లాటరీ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. వరంగల్ ఉర్సుగుట్ట నాని గార్డెన్‌లో కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆధ్వర్యంలో జిల్లా ఎకై ్సజ్‌శాఖ సూపరింటెండెంట్ అరుణ్‌కుమార్ నేతృత్వంలో మొత్తం 57 షాపులకు పారదర్శకంగా లక్కీడ్రా పద్ధతిన లైసెన్స్‌దారుల ఎంపిక ప్రక్రియను సోమవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై 57 షాపులకు లాటరీ పద్ధతిలో లక్కీడ్రా తీసి విజేతలను ప్రకటించారు. జిల్లాలో మొత్తం 57 షాపులకు 1,958 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.60 కోట్ల ఆదాయం వచ్చింది. నడికూడ 42వ నంబర్ షాపునకు 100 దరఖాస్తులు రాగా, జి.రమణరెడ్డి విజేతగా నిలిచారు. లాటరీ ప్రక్రియలో నర్సంపేటకు చెందిన జి.సాంబలక్ష్మి నర్సంపేట 5వ షాపును దక్కించుకోగా, ఆమె భర్త జి.రాజేశ్వర్‌రావుకు ఆత్మకూరులో 38వ షాపును లాటరీలో సొంతం చేసుకున్నాడు. కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు తాతాజీ, నరేష్‌రెడ్డి, స్వరూప, మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేష్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు
రెండు షాపులు దక్కడం
అదృష్టంగా భావిస్తున్నాం
మాది నర్సంపేట పట్టణం. 25 ఏళ్లుగా మద్యం షాపులు నిర్వహిస్తున్నాం. మేమిద్దరం మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోగా, మాకు నర్సంపేట 5వ షాపు, ఆత్మకూరులో 38వ షాపు దక్కాయి. దీన్ని అదృష్టంగా భావిస్తున్నాం.
– రాజేశ్వర్‌రావు, సాంబలక్ష్మి దంపతులు
లక్కీ డ్రాలో వైన్స్ రావడంతో అవధుల్లేని ఆనందం
రాని వారు నిరాశతో ఇంటిముఖం..
దుకాణాలను కేటాయించిన
కలెక్టర్ స్నేహ శబరీష్
67 వైన్స్ ..3,175 దరఖాస్తులు
డిసెంబర్ 1నుంచి నూతన
వైన్స్ నిర్వహణ
అత్యధికంగా కడిపికొండ 116...
అత్యల్పంగా కమలాపూర్ 21
‘లక్కు.. కిక్కు’ దక్కింది!


