శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
హన్మకొండ : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ప్రతిరోజు హనుమకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరి రాత్రి 7:30 రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటుంది. తిరిగి ఉదయం 5గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బయలుదేరి ఉప్పల్ మీదుగా హనుమకొండ, భూపాలపల్లికి వెళ్తుంది. హనుమకొండ–శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చార్జీ రూ.700 లుగా నిర్ణయించారు. ఈ బస్సును సోమవారం ప్రారంభించినట్లు వరంగల్–1 డిపో మేనేజర్ అర్పిత తెలిపారు. ఆర్టీసీ వెబ్‌సైట్‌లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : కపాస్ కిసాన్ యాప్ ద్వారా ప్రస్తుతం పత్తి కొనుగోళ్లకు స్లాట్ బుకింగ్ జరుగుతుందని హనుమకొండ కలెక్టర్ స్నేహశబరీష్ వివరించారు. సోమవారం హైదరాబాద్ నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ కె.రామకృష్ణారావులు పత్తి, ధాన్యం, మొక్కజొన్న పంటల కొనుగోళ్లు, తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహశబరీష్, వరంగల్‌నుంచి అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై మాట్లాడారు. జిల్లాల పరిస్థితులు, తీసుకుంటున్న చర్యలను వివరించారు. సమావేశంలో రెండు జిల్లాల అధికా రులు మేన శ్రీను, సంజీవరెడ్డి, రవీంద్రసింగ్, రాంరెడ్డి, అనురాధ, నీరజ, కిష్టయ్య, సంధ్యారాణి, సురేఖ తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట : ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్డ్‌మెంట్ బెనిఫిట్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు నరసింహా రెడ్డి, వీరయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నాయకులు, పెన్షనర్లతో కలిసి ఆయా జిల్లాల కలె క్టరేట్ల ఎదుట వేర్వేరుగా నిరసన ప్రదర్శన, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2024 మార్చి నుంచి 2025 సెప్టెంబర్ వరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెన్షన్ తప్ప ఎలాంటి ప్రయోజనాలు అందలేదని విమర్శించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వీరస్వామి, అసోసియేట్ ఉపాధ్యక్షుడు సుధీర్‌బాబు, జిల్లాల బాధ్యులు కందుకూరి దేవదాసు, రా వుల రమేశ్, వెంకటేశ్వర్లు, శ్యాం సుందర్ రెడ్డి, రాజిరెడ్డి, లింగారెడ్డి, శ్రీధర ధర్మేద్ర, కడారి భో గేశ్వర్, మహబూబ్ అలీ, గఫార్, బాబురావు, సదానందం, వేణుమాధవ్, కృష్ణమూర్తి, కృష్ణకుమార్, సారంగపాణి, సమ్మ య్య, కుమారస్వామి, దామోదర్, చలం పాల్గొన్నారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం


