ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్ క్రీడా ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం పాఠశాల క్రీడల సమాఖ్య అండర్–19 బాలబాలికల ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా కొనసాగాయి. వివిధ క్రీడాంశాలలో నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజు యోగా, కరాటే, టగ్‌ఆఫ్‌వార్, తంగ్‌తా, బాస్కెట్‌బాల్, టేబుల్ టెన్నీస్, సాఫ్ట్ టెన్నిస్, మాల్కమ్, గట్‌కా క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి నరెడ్ల శ్రీధర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 350 మంది క్రీడాకారులు హాజరైనట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌జేడీ గోపాల్, డీవైఎస్‌ఓ గుగులోత్ అశోక్‌కుమార్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ కాకా మాధవరావు, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.ప్రభాకర్‌రెడ్డి, కార్యదర్శి దరిగి కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు పాల్గొన్నారు.


