శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారం
హన్మకొండ కల్చరల్ : కవి, న్యాయవాది డాక్టర్ నమిలికొండ బాలకిషన్‌రావు స్మారకంగా ఏర్పాటు చేసిన నబారా పురస్కారం–2025ను కవి పొట్లపల్లి శ్రీనివాసరావు అందుకున్నారు. ఆదివారం రాత్రి శ్రీరాజరాజనరేంద్రంద్ర భాషానిలయంలో కవి బిల్ల మహేందర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ బన్న అయిలయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నబారా సొసైటీ అధ్యక్షుడు నమిలికొండ పాంచాలరాయ్ అతిథులతో కలిసి శ్రీనివాసరావుకు నబారా స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎన్వీఎన్ చారి, గన్నమరాజు గిరిజమనోహర బాబు, వీఆర్ విద్యార్థి చంద్, వల్లంపట్ల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


