ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం | - | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

Oct 19 2025 6:57 AM | Updated on Oct 19 2025 6:57 AM

ఏటీఎం

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

దీపావళి పండుగ రైళ్లు అరుణాచలానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యం జూనియర్‌ ఫ్యాషన్‌ వీక్‌లో వరంగల్‌ చిన్నారి

కాజీపేట: కాజీపేటలోని డీజిల్‌ కాలనీ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఎస్‌బీఐ ఏటీఎం కేంద్రంలో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించి మిషన్‌ను ధ్వంసం చేశారు. ఏటీఎం మిషన్‌లో డబ్బులు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించిన దుండగులు ముఖాలకు ముసుగులు ధరించి.. వెంట తెచ్చుకున్న ఆయుధాలతో మిషన్‌ను ధ్వంసం చేశారు. ఎంత ప్రయత్నించినా డబ్బులు బయటకు వచ్చే బాక్స్‌ మాత్రమే ఓపెన్‌ అయ్యింది. దీంతో దుండగులు కోపంతో మిషన్‌ను ఇష్టం వచ్చినట్లుగా ధ్వంసం చేసి నిరాశతో పరారయ్యారు. ఉదయం వేళ డబ్బులు డ్రా చేయడానికి వచ్చిన వారు గమనించి 100 డయల్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలికి ఎస్‌బీఐ అధికారులతో పాటు సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సైలు లవన్‌కుమార్‌, శివ క్రైం పార్టీ సిబ్బందితో చేరుకుని ఆధారాల కోసం ప్రయత్నించారు. రహదారులపై ఉన్న సీసీ కెమెరాలను జల్లెడపడుతున్నారు. ఇది స్థానిక దొంగల పనేనా? లేక ఇతర ప్రాంతాలకు చెందినవారెవరైనా చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఏటీఎంలో దాదాపు రూ.7లక్షల వరకు నిల్వ ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎస్‌బీఐ బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌ మీదుగా దీపావళి పండుగకు వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు యశ్వంత్‌పూర్‌–ముజఫర్‌ఫూర్‌ మధ్య రెండు ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను ప్రవేశపెట్టి నడిపిస్తున్నట్లు శనివారం రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు. అక్టోబర్‌ 22వ తేదీన యశ్వంత్‌పూర్‌ – ముజఫర్‌పూర్‌ (06261) ఎక్స్‌ప్రెస్‌ గురువారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా అక్టోబర్‌ 24వ తేదీన ముజఫర్‌పూర్‌–బెంగళూర్‌ సీఎఎన్‌టీటీ (06262) ఎక్స్‌ప్రెస్‌ కాజీపేటకు శనివారం చేరుకొని వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు ఎలహంక, ధర్మవరం, అనంతపూర్‌, దోన్‌, మహబూబ్‌నగర్‌, కాచిగూడ, కాజీపేట, రామగుండం, బల్లార్షా, నాగపూర్‌, ఇటార్సీ, జబల్‌పూర్‌, సంత, ప్రయాగ్‌రాజ్‌, చోకి, పండిట్‌ డీడీ ఉపాధ్యాయ, బాక్సర్‌, ఆర, ధానాపూర్‌, పాటలిపుత్ర, సోనాపూర్‌, హజిపూర్‌ రైల్వే స్టేషన్‌లలో హాల్టింగ్‌ కల్పించినట్లు సీపీఆర్‌ఓ తెలిపారు.

హన్మకొండ: తమిళనాడులోని అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయాలనుకునే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు టీజీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌ డి.విజయభాను తెలిపారు. నవంబర్‌ 5న జరిగే గిరి ప్రదక్షిణకు అదే నెల 3న హనుమకొండ జిల్లా బస్‌స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చార్జీ పెద్దలకు రూ.5 వేలు, పిల్లలకు రూ.3,500గా నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ రిజర్వేషన్‌ కౌంటర్లలోనూ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ టూర్‌ ప్యాకేజీ పూర్తి సమాచారం కోసం 90634 07493, 77805 65971, 98663 73825, 99592 26047 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని కోరారు.

వరంగల్‌: హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన ఫ్యాషన్‌ వీక్‌ జూనియర్స్‌ అనే కార్యక్రమంలో వరంగల్‌ ప్రీ స్కాలర్స్‌ మాంటిసోరి ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన మైరా చేసిన క్యాట్‌ వాక్‌ అందరినీ ఆకర్షించింది. బెస్ట్‌ ఫర్ఫార్మెన్స్‌గా ఎంపికై ంది. రెండేళ్ల 9నెలల వయస్సు ఉన్న మైరా ఇటీవల పదవీ విరమణ చెందిన ఏనుమాముల మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శి పోలేపాక నిర్మల మనుమరాలు.

మెరుగైన వైద్యసేవలు

అందించాలి

వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

న్యూశాయంపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశపు హాల్‌లో వైద్య, ఆరోగ్యశాఖ, ప్రోగ్రాం అధికారులు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలతో శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యసేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల లభ్యత, వైద్యుల హజరు, పరీక్ష పరికరాల వినియోగం, మాతాశిశు సంరక్షణ వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీసెస్‌ సర్వే నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిజేరియన్లు కాకుండా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని కోరారు. ప్రైవేట్‌ డాక్టర్లు విధిగా సాధారణమైన ప్రసవాలు ప్రోత్సహించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్‌ బి.సాంబశివరావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు ప్రకాశ్‌, కొంరయ్య, ప్రోగాం అధికారులు రవీందర్‌, ఆచార్య, విజయ్‌కుమార్‌, మోహన్‌సింగ్‌, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

మిషన్‌ తెరుచుకోకపోవడంతో

దొంగలు పరార్‌

ఏటీఎంలో నగదు  కొల్లగొట్టేందుకు యత్నం1
1/2

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

ఏటీఎంలో నగదు  కొల్లగొట్టేందుకు యత్నం2
2/2

ఏటీఎంలో నగదు కొల్లగొట్టేందుకు యత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement