
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారద
హన్మకొండ అర్బన్/న్యూశాయంపేట: హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమర్థవంతంగా ఏర్పాట్లు చేయనున్నట్లు హనుమకొండ, వరంగల్ కలెక్టర్ స్నేహ శబరీష్ , సత్యశారద తెలిపారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. హనుమకొండ, వరంగల్ కలెక్టరేట్ల నుంచి హాజరైన కలెక్టర్లు మాట్లాడుతూ.. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు, ఎన్నికల విధులకు సంబంధించి రెండు దఫాలుగా ఉద్యోగులకు శిక్షణ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చ తప్పకుండా పాటిస్తూ పటిష్టంగా ఎన్నికలు నిర్వహిస్తామని వివరించారు. ఆయా సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీరమాకాంత్, జెడ్పీ సీఈఓ రవి, వరంగల్ డీపీఓ కల్ప న, వాసుమతి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.