
ప్రహరీ పనులు పూర్తి చేయండి
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: హనుమకొండలోని బాలసముద్రం బల్దియా వెహికిల్ షెడ్డు ప్రహరీ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం వెహికల్ షెడ్ ప్రాంతంలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మిత పనులతో పాటు సమీపంలోని రెండు పడకల గదులు సముదాయం (2 బీహెచ్‌కే)లో నీటి సరఫరా వసతి కల్పన కోసం చేయాల్సిన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె వెంట ఎంహెచ్‌ఓ రాజేశ్, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్‌కుమార్, రాగి శ్రీకాంత్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.