
విద్యార్థులు ఉద్యమించాలి
హన్మకొండ: సాయుధ పోరాట స్ఫూర్తితో విద్యారంగం అభివృద్ధి, విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఉద్యమించాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యూఎస్‌ఎఫ్‌ఐ) జాతీయ సలహాదారుడు అరుణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుదవారం హనుమకొండ నక్కలగుట్టలోని హోటల్ హరిత కాకతీయలో యూఎస్‌ఎఫ్‌ఐ హనుమకొండ జిల్లా మహాసభ జరిగింది. ముందుగా హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు నుంచి హోటల్ వరకు విద్యార్థులు ర్యాలీ తీశారు. ఏఐకేఎఫ్ జాతీయ కార్యదర్శి మోర్తాల చందర్‌రావు జెండావిష్కరణ చేశారు. భగత్‌సింగ్ చిత్రపటానికి అరుణ్‌కుమార్, నాయకులు పూలమాల వేసి ని వాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం యూఎస్‌ఎఫ్‌ఐ అలుపెరుగని పోరాటాలను చేస్తోందని తెలిపారు. జిల్లా అధ్యక్షుడు మనోజ్, కార్యదర్శి మాలోత్ రాజేశ్‌నాయక్, నాయకులు బాలగోని రాకేష్, జయకృష్ణ, హరీశ్, కృష్ణమూర్తి, అభిరామ్, సురేశ్, ధనుశ్, మహేశ్ పాల్గొన్నారు.