అప్రమత్తతే ఆయుధం.. | - | Sakshi
Sakshi News home page

అప్రమత్తతే ఆయుధం..

Sep 18 2025 6:41 AM | Updated on Sep 18 2025 6:49 AM

జెమిని మోజాయిక్‌ వైరస్‌ (గుబ్బ) నివారణకు..

మహబూబాబాద్‌ రూరల్‌ : జెమిని వైరస్‌, బొబ్బ రోగం.. ప్రస్తుతం మిరప రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పంటను నాటి నెలరోజులు గడవక ముందే చిన్న మొక్కలపై రైతులు పోటాపోటీగా పురుగుల మందులు, సిఫార్సు లేని బయో మందులను పిచికారీ చేస్తున్నారు. ఫలితంగా పెట్టుబడి పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆగస్టులో పొడి వాతావరణం పరిస్థితులలో వేసిన మిరప పంటను ప్రస్తుతం వివిధ చీడ పీడలు ఆశిస్తున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో మిరప పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మహబూబాబాద్‌ మండలం మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త దిలీప్‌ కుమార్‌, శాస్త్రవేత్తలు సుహాసిని, క్రాంతికుమార్‌.. రైతులకు సలహాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు వారి మాటల్లోనే..

పైముడత నివారణకు :

ఫిప్రోనిల్‌ ఎస్‌.సి 2 మిల్లీలీటర్లను లీటర్‌ నీటిలో లేదా డైఫెన్‌ ధయురాన్‌ 1.5గ్రాములను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

కింది ముడత నివారణకు ..

నీటిలో కరిగే గంధకం 3 గ్రాములను లీటర్‌ నీటిలో లేదా స్పైరోమెసిఫెన్‌ 0.8 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటికి లేదా ప్రాపర్‌ గైట్‌ 57శాతం 2 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

లద్దె పురుగు నివారణకు ..

నోవాల్యూర్‌న్‌ 0.75 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో లేదా స్పైనోసాడ్‌ 0.25 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రాములను లీటర్‌ నీటిలో లేదా క్లోరాంట్రనిలిప్రోల్‌ 0.3 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. సిఫార్సు లేని బయో మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడొద్దు.

● పొలం చుట్టూ 2 నుంచి 3 వరుసల సజ్జ, జొన్న లేదా మొక్కజొన్న రక్షణ పంటలుగా వేసుకోవాలి. పసుపు, నీలం రంగు జిగురు అట్టలను 20 నుంచి 25 చొప్పున ఎకరానికి రైతులు సామూహికంగా వేసుకోవాలి. మొక్కల ఎత్తును బట్టి జిగురు అట్టలను కూడా పైకి అమర్చుకోవాలి. తెల్ల దోమల నివారణకు 5శాతం వేప గింజల కషాయం ( వేప నూనె 1500 పీపీఎం) 5 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో లేదా ఫైరిప్రాక్సిఫెన్‌ 102 ఇ.సి. 1.5 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో లేదా ఫెరిప్రాక్సిఫెన్‌ 57. ఇ.సి. + ఫెన్‌ పోపాత్రిన్‌ 15 ఇ.సి. 1 మిల్లీ లీటర్‌ను లీటర్‌ నీటిలో లేదా ఫెనో పాత్రిన్‌ 30శాతం ఇ.సి 0.5 మిల్లీ లీటర్లను లీటర్‌ నీటిలో లేదా థయామిథాక్సాం 0.4 గ్రాములను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

● ప్రతీ సారి రైతులు పురుగుమందును పిచికారీ చేసినప్పుడు కేవలం పురుగు మందును మాత్రమే కాకుండా పోషకాల మిశ్రమం (191919/13045) లేదా సూక్ష్మ పోషకాల మిశ్రమం 5 గ్రాములను లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేస్తే మొక్కలకు బలాన్ని ఇస్తూ, వ్యాధి నిరోధక శక్తి పెరిగి కొత్తరకాల చీడ, పీడలను తట్టుకొని నిలబడే అవకాశం ఉంటుంది.

మిరప పంటను ఆశిస్తున్న చీడపీడలు

సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

జెమిని వైరస్‌, బొబ్బ రోగంపై జాగ్రత్తగా ఉండాలి

రైతులకు మల్యాల కేవీకే ప్రోగ్రాం

కోఆర్డినేటర్‌ దిలీప్‌ కుమార్‌, శాస్త్రవేత్తలు సుహాసిని, క్రాంతికుమార్‌ సలహాలు

ఇది తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. వైరస్‌ నివారణకు ప్రత్యేకంగా ఎలాంటి మందులు లేవు. అందుకే సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలి.

తొలిదశలోనే వైరస్‌ సోకిన మొక్కలను ఎప్పటికప్పుడు పీకి కాల్చి వేయాలి. ప్రధాన పొలంలో, గట్లపై కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని రకాల కలుపు మొక్కలు వైరస్‌ తెగుళ్లకు ఆశ్రయం కల్పిస్తాయి. మిరప తోటలో వంగ (బెండ), టమాట మొక్కలను ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచొద్దు. ఇవి తెల్ల దోమలకు ఆశ్రయం కల్పిస్తాయి.

అప్రమత్తతే ఆయుధం.. 1
1/4

అప్రమత్తతే ఆయుధం..

అప్రమత్తతే ఆయుధం.. 2
2/4

అప్రమత్తతే ఆయుధం..

అప్రమత్తతే ఆయుధం.. 3
3/4

అప్రమత్తతే ఆయుధం..

అప్రమత్తతే ఆయుధం.. 4
4/4

అప్రమత్తతే ఆయుధం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement