
ఆర్థిక ప్రగతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్రం
హన్మకొండ: ఆర్థిక ప్రగతి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రం ముందుకెళ్తోందని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద పూలమాల ఉంచి అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం జరిపిన పోరాట ఫలితంగా 1948 సెప్టెంబర్ 17న ప్రత్యేక సంస్థానంగా ఉన్న తెలంగాణ ప్రాంతం భారత్‌లో విలీనమైందన్నారు. ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారన్నారు. టీజీ ఎన్పీడీసీఎల్‌ను సాంకేతికంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ బోనాల కిషన్, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్‌లాల్, రాజు చౌహాన్, అశోక్, కె.మాధవరావు, చీఫ్ జనరల్ మేనేజర్లు రవీంధ్రనాథ్, ఆర్.చరణ్ దాస్, జనరల్ మేనేజర్లు వెంకట కృష్ణ, మల్లికార్జున్,నాగప్రసాద్, వేణుబాబు, అన్నపూర్ణ, శ్రీకాంత్, కంపెనీ సెక్రటరీ కె.వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ పూర్తి చేయాలి
ట్రాన్స్‌ఫార్మర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. బుధవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, వివిధ విభాగాల డీఈలు, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లపై ఉన్న సర్వీస్‌లను మ్యాపింగ్ చేయాలన్నారు. ఇంటి లోపల ఉన్న మీటర్లు బయట అమర్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిల్ పరిధిలో విధిగా పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు టి.సదర్ లాల్, కె.తిరుమల్ రావు, రాజుచౌహాన్, సి.జి.ఎంఆర్. చరణ్ దాస్, జీఎంలు వెంకటకృష్ణ, అన్నపూర్ణ, నాగప్రసాద్, వేణుబాబు, కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
కర్నాటి వరుణ్ రెడ్డి