
నాడు శాంతిని నెలకొల్పడమే గాంధీ ధ్యేయం
విద్యారణ్యపురి: దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం సిద్ధించాక నాడు శాంతిని నెలకొల్ప డమే ధ్యేయంగా పనిచేసిన మహనీయుడు మహాత్మాగాంధీ అని కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్యనవీన్ అన్నారు. శనివారం హనుమకొండలోని నవీన్ రెసిడెన్సీలో ప్రజాకవికాళోజీ నారాయణరావు రచించిన బాపూ..బాపూ రెండో ముద్రణకావ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భగా నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగాపాల్గొని మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితలు మహాత్మాగాంధీ గురించి అద్భుతంగా రచించారన్నారు. గిరిజా మనోహరాబాబు ఈ గ్రంథాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి, బాధ్యులు పొట్లపెల్లి శ్రీనివాస్‌రావు, పందిళ్ల అశోక్‌కుమార్, కాళోజీ ఫౌండేషన్ పేరుతో గ్రంఽథాన్ని ముద్రించిన చింతకుంట్ల సంపత్‌రెడ్డి, రచయితలు గంటారామిరెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, బాసిరి సాంబశివరావు, నెల్లుట్ల రమాదేవి, డాక్టర్ ఆగపాటి రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత నవీన్