
కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట
జఫర్‌గఢ్: గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అధిక నిధులు కేటాయిస్తూ పె ద్దపీట వేస్తోందని ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మండలంలోని కూనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి 44వ సబ్ జూనియర్ ఇంటర్ షిప్ బాల్ బ్యాండ్మిటన్ క్రీడా పోటీలను శనివారం పాఠశాల పూర్వ వి ద్యార్థి, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ప్రా రంభించారు. ఈ సందర్భంగా జంగా రాఘవ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడలకు మొండిచేయి చూపిందన్నారు. రా ష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీ ఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలపాలన్నా రు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించి స్ఫూర్తి చాటాలన్నారు. తల్లిదండ్రులు పి ల్లలను చదువుతోపాటు క్రీడల్లో ప్రోత్సహించి వారి ఉజ్వల భవిష్యత్‌కు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గాదెపాక అయోధ్య, బాధ్యులు బంగారు స్వామి, బి.వి. రమణ, దర్గయ్య, వెంకట్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తీగల కరుణాకర్‌రా వు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెబోయిన భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
ఖోఖో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి