రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే.. | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

Sep 5 2025 4:50 AM | Updated on Sep 5 2025 5:50 AM

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

కేయూ క్యాంపస్‌: తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డుల జాబితాను గురువారం ప్రకటించింది. గురుపూజోత్సవం రోజున (నేడు, శుక్రవారం) వీరికి హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్ప కళా వేదికలో జరిగే వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు. ఇందులో కేయూలోని ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌ ఎన్‌.ప్రసాద్‌, హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మల్లారం అరుణ, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.ప్రశాంతి, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాలోతు గన్‌సింగ్‌ హనుమకొండ జిల్లాలోని పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హిస్టరీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. మల్లయ్య ఎంపికయ్యారు.

పరిశోధనల్లో మేటి..

కేయూలోని ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్‌ ఎన్‌.ప్రసాద్‌ పరిశోధనల పరంగా 12 పేటెంట్లు కలిగి ఉన్నారు. వీటిలో క్యాన్సర్‌ బయాలజీపై పరిశోధనలు చేశారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో క్యాన్సర్‌ థెరఫీ పోస్ట్‌ డాక్టరల్‌ ఫెలోగా, స్ట్టాన్‌ఫోర్డ్‌ రీసెర్చ్‌ ఇంటర్నేషనల్‌లో పని చేశారు. ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపాల్‌గా హాస్టళ్ల డైరెక్టర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. ప్రసాద్‌ పర్యవేక్షణలో ఏడుగురు పీహెచ్‌డీ పూర్తి చేశారు.

బోధనలో ఘనాపాటి

హనుమకొండ ప్రభుత్వ పింగిళి మహిళా కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మల్లారం అరుణ రెండు జాతీయ సదస్సులు నిర్వహించారు. కెమిస్ట్రీకి సంబంధించిన పది పాఠ్యపుస్తకాలు రచించారు. టీసాట్‌ నిపుణ విద్య చానల్‌లో 12 ప్రత్యక్ష ప్రసారాలు అందించారు. ఆమె పర్యవేక్షణలో విద్యార్థులు జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టు పోటీల్లోనూ మొదటి బహుమతి సాధించారు.

లేరెవ్వరు సాటి..

ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల కెమిస్ట్రీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.ప్రశాంతి విద్యార్థులకు సృజనాత్మక డిజిటల్‌ పద్ధతుల ద్వారా కెమిస్ట్రీ బోధిస్తున్నారు. విద్యార్థులకు ఉపయుక్తమైన మూడు పుస్తకాలు రాశారు. పరిశోధనలపరంగా రెండు పేటెంట్లు కలిగి ఉన్నారు. ఆమెకు సంబంధించిన 22 రీసెర్చ్‌ పేపర్లు అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమయ్యాయి.

సామాజిక సేవ.. ఆయన తోవ..

హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బాటనీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మాలోతు గన్‌సింగ్‌ బోధనతో పాటు, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లతో సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. హరితహారం ఇన్‌చార్జ్‌గా సేవలు అందిస్తున్నారు.

‘ప్రాజెక్టు’ల రూపకల్పనలో దిట్ట

హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హిస్టరీ విభాగ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.మల్లయ్య ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌గా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈమేరకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారిగా కూడా అవార్డు ఇప్పటికే అందుకున్నారు. ఐదు పుస్తకాలు రాశారు. జిజ్ఞాస స్టూడెంట్స్‌ స్టడీ ప్రాజెక్టులను రూపొందించడంలోనూ దిట్ట. 25 పరిశోధన పత్రాలు జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్‌లో ప్రచురితమాయ్యయి.

అంతరించిపోతున్న కళారూపాలకు జీవం

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వరంగల్‌లోని జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్‌ గడ్డం వెంకన్న గత 30 ఏళ్లుగా గిరిజన విజ్ఞానపీఠంలో వివిద హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. పటం కథలు, కథకులు అనే అంశంపై పరిశోధనచేసి గ్రంథాన్ని వెలువరించారు. అంతరించిపోతున్న జానపద గిరిజన కళారూపాలను, కళాకారులను గుర్తించి పలు కళారూపాలను ఆడియో, వీడియో ఫొటో మాధ్యమాల్లో డాక్యుమెంటేషన్‌ చేశారు. జానపద గిరిజన విజ్ఞాన బహుముఖ అంశాలపై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వివిధ జిల్లాల్లో పర్యటించి 20కి పైగా పుస్తకాలు రాశారు. వివిధ జర్నల్స్‌లో, పుస్తకాల్లో 70 వరకు వ్యాసాలు రాశారు. జాతీయ స్థాయి సదస్సుల్లో 50 వరకు పరిశోధన పత్రాలు సమర్పించారు.

మాలోతు గన్‌సింగ్‌, ఎన్‌.మల్లయ్య, గడ్డం వెంకన్న

ఎన్‌.ప్రసాద్‌ మల్లారం అరుణ ప్రశాంతి

నేడు హైదరాబాద్‌లో

సీఎం చేతులమీదుగా అవార్డులు

వృత్తిలో వారి సేవలు గుర్తించి

ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..1
1/5

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..2
2/5

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..3
3/5

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..4
4/5

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..5
5/5

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకులు వీరే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement