
రెట్టింపు సంఖ్యలో బడికి
ఆత్మకూరు: మండలంలో ని చౌళ్లపల్లి ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం చల్లా రమ ప్రభుత్వ పాఠశాలపై ప్రజలకు మక్కువ కలిగిస్తున్నారు. పాఠశాలలో డ్రాపవుట్స్ లేకుండా.. విద్యార్థుల సంఖ్య 20 నుంచి 40కి చేరాలా కృషి చేశారు. 2024 జూన్‌లో చౌళ్లపల్లి పాఠశాలలో హెచ్‌ఎంగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఆకర్షనీయ కార్యక్రమాలు చేపడుతూ.. పిల్లల్ని పాఠశాలకు దగ్గర చేస్తున్నారు. విద్యార్థులతో కో కరిక్యులర్ యాక్టివిటీస్ చేయిస్తూ వారిని మరింత చురుకుదనాన్ని కలిగిస్తున్నారు. సంస్కృతీ సంప్రదాయాల్ని నేర్పిస్తూ.. వేడుకల్ని పాఠశాలలో నిర్వహిస్తూ సృజనాత్మకత పెంచుతున్నారు. మండల అధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు.

రెట్టింపు సంఖ్యలో బడికి