
శుక్రవారం శ్రీ 5 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
హిందీపై పిల్లల్లో ఇష్టం పెంచేలా బోధన
విద్యారణ్యపురి: రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా హనుమకొండ లష్కర్ బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల హిందీ స్కూల్ అసిస్టెంట్ చెడిపాక రాములుకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈనెల 5న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గురు పూజోత్సవం అవార్డుల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు.
సులభ పద్ధతిలో హిందీ బోధన
విద్యార్థుల్లో భాషపై ఇష్టాన్ని పెంచుతూ.. హిందీ బోధిస్తున్నారు. పేద విద్యార్థులకు పలకలు, త్రిభాషా డిక్షనరీలు, చార్టులు, పెన్సిళ్లు, స్కెచ్‌లు అందిస్తున్నారు. వృత్తి రీత్యా హిందీ స్కూల్ అసిస్టెంట్ అయినప్పటికీ ప్రవృత్తి పరంగా తెలుగులో పలు సినిమాపాటలు రాశారు. సోగ్గాడే శోభన్‌కృష్ణ, కేసీఆర్ బయోపిక్ ఉద్యమసింహం, నేను కీర్తన సినిమాలకు పాటలు కూడా రాశారు. 10 యూట్యూబ్ చానళ్లకు ఆయన రాసిన జానపద గీతాలు ప్రచారంలో ఉన్నాయి. ప్రైవేట్ ఆల్బమ్స్ 14 ఉన్నాయి. జానపద గీతాలు రచించి రాణిస్తున్నారు. ‘మహాగేయ ప్రస్థానం’ అనే పుస్తకాన్ని రచించారు. దేశభక్తి గీతాలు అందులో ఉన్నాయి. కవి, రచయిత గాయకుడిగా రాణిస్తున్నారు.రాములు తనకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడంపై ఆనందం వ్యక్తం చేశారు.