అభివృద్ధి పనులు పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు పూర్తి చేయండి

Sep 5 2025 4:50 AM | Updated on Sep 5 2025 4:50 AM

అభివృ

అభివృద్ధి పనులు పూర్తి చేయండి

ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపై సమావేశం విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి లోకల్‌ కోర్టు

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

కాజీపేట అర్బన్‌: వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ స్నేహ శబరీష్‌, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో పాటు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. భద్రకాళి ఆలయ మాఢ వీధుల నిర్మాణం, కాకతీయ మ్యూజి కల్‌ గార్డెన్‌ పునరుద్ధరణ, వేయి స్తంభాల ఆలయం, సివిల్‌ సప్‌లై గో దాంలు, కాజీపేట ఆర్వోబీ నిర్మాణం తదితర పనుల్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో హనుమకొండ అడిషనల్‌ కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ రమేశ్‌రాథోడ్‌, ‘కుడా’ పీఓ అజిత్‌రెడ్డి పాల్గొన్నారు.

న్యూశాయంపేట: ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఇంజనీరింగ్‌ బృందం ప్రిలిమినరీ సర్వేలో భాగంగా గురువారం మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను పరిశీలించింది. అనంతరం బృంద సభ్యులు వరంగల్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారదతో కలిసి ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధిపై చర్చించారు. సమావేశంలో ఏఏఐ ఏజీఎంలు నటరాజ్‌, మనీష్‌ జోన్వాల్‌, మేనేజర్లు ఓం ప్రకాశ్‌, రోషన్‌ రావత్‌, ఎన్పీడీసీఎల్‌, ఇరిగేషన్‌ ఎస్‌ ఈలు గౌతంరెడ్డి, రాంప్రసాద్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌ పాల్గొన్నారు.

కాజీపేట అర్బన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి, వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లోకల్‌ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం కన్సూమర్స్‌ గ్రీవెన్స్‌ రిడ్రసల్‌ ఫోరం చైర్‌పర్సన్‌ ఎన్వీ.వేణుగోపాలచారి ఒక ప్రకటనలో తెలిపారు. లోకల్‌ కోర్టులను ఈనెల 6 నుంచి 19వ తేదీల్లో ఎన్పీడీసీఎల్‌ పరిధి వరంగల్‌, హనుమకొండ, పెద్దపల్లి, మహబూబాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ సర్కిళ్లలోఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి లోకల్‌ కోర్టులను వినియోగించుకోవాలని సూచించారు.

లోకల్‌ కోర్టులు నిర్వహించే ప్రదేశాలివే..

6వ తేదీ: హనుమకొండ సర్కిల్‌, భీమదేవరపల్లి, నారాయణగిరి, కొత్తకొండ

12న: వరంగల్‌ సర్కిల్‌, నర్సంపేట, చెన్నారావుపేట, నెక్కొండ

16న: మహబూబాబాద్‌ సర్కిల్‌, డోర్నకల్‌, కురవి, కొత్తపేట

అభివృద్ధి పనులు పూర్తి చేయండి1
1/1

అభివృద్ధి పనులు పూర్తి చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement