
సోమవారం శ్రీ 28 శ్రీ జూలై శ్రీ 2025
దేవాదాయశాఖ భూముల్ని
ఆక్రమిస్తే చర్యలు: ఈఓ
హన్మకొండ కల్చరల్: దేవాదాయశాఖ భూములు ఆక్రమించాలని చూసినా, గుడిసెలు, షెడ్లు వేసినా దేవాదాయశాఖ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని భద్రకాళి దేవాలయ ఈఓ, జి ల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. కొంతమంది దేవాలయ కార్యనిర్వహణాధికారులు కావాలని బద్నాం చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. భద్రకాళి దేవాలయ భూములను ఆక్రమించాలనే దురుద్దేశంతో దేవాదాయశాఖ స్థలంలో విగ్రహం పెట్టి పూజలు చేస్తే, భక్తులను భ్రమలో పెట్టి కోర్టు వరకు వెళ్తున్నారని తెలిపారు. భూములను ఆక్రమించాలని చూస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆర్టీసీ చార్జీల తగ్గింపు
హన్మకొండ: హైదరాబాద్–బెంగళూరు మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల చార్జీలు తగ్గించినట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పి.అర్పిత తెలిపారు. లహరి, సూపర్ లగ్జరీ బస్సుల చార్జీలు భారీగా తగ్గించినట్లు, ఇవి ఈనెల 26 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లహరి బస్సులో ఒకరికి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చార్జి రూ.1,440 ఉండగా.. ప్రస్తుతం రూ.1,250కి, అలాగే స్లీపర్ చార్జి రూ.1,800 ఉండగా.. రూ.1,620కి, సూ పర్ లగ్జరీకి రూ.1,080 నుంచి రూ.990కు తగ్గించినట్లు వివరించారు. ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
హనుమకొండ, వరంగల్‌ను ఒకే జిల్లాగా ప్రకటించాలి
హన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలిపి ఒకే వరంగల్ జిల్లాగా ప్రకటించాలని, ఉత్తర తెలంగాణ కేంద్రంగా తీర్చిదిద్దాలని పౌర సమాజం డిమాండ్ చేసింది. ఆదివారం నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఆధ్వర్యంలో హనుమకొండ, వరంగల్‌ను ఒకే వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ.. వరంగల్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి కాకుండా రాజకీయంగా ఎదగకుండా గత పాలకులు విభజించారన్నారు. ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు పుల్లూరు సుధాకర్ మాట్లాడుతూ.. రెండు జిల్లాల అభివృద్ధి పరస్పరం ఆధారపడి ఉందన్నారు. వీటిని ఒక్కటి చేసేలా నాయకులు చొరవ చూపాలన్నారు. మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ డాక్టర్ టి రాజేశ్వరరావు, సీనియర్ రాజకీయ నాయకుడు, సామాజిక విశ్లేషకుడు కన్నెపల్లి రాజయ్య యాదవ్, ఆయా పార్టీలు, సంఘాల నాయకులు చుక్కయ్య, జి.ప్రభాకర్‌రెడ్డి, కొలను సంతోష్ రెడ్డి, నున్నా అప్పారావు, అబూబకర్, ప్రొఫెసర్ విజయబాబు, చిల్ల రాజేంద్రప్రసాద్, పొట్లపల్లి శ్రీనివాస్ రావు, చింతం ప్రవీణ్, గంటా రాంరెడ్డి, చాపర్తి కుమార్, హనుమకొండ రెడ్ క్రాస్ కోశాధికారి బొమ్మినేని పాపిరెడ్డి, రిటైర్డ్ అధ్యాపకుడు బాబురావు, సామాజికవేత్త సోమ రామమూర్తి, సాయినీ నరేందర్, రైతు సంఘం నాయకులు సోమిడి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గురుకులాలను
గాలికొదిలిన ప్రభుత్వం
● జిల్లాకో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తాం..
కేసులకు జంకొద్దు
● బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కె.తారక రామారావు
● జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో
పర్యటన
న్యూస్‌రీల్