
వానొస్తే సెలవు ఇస్తున్నాం..
హసన్‌పర్తి: భారీ వర్షం కురిస్తే ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని గురుకులానికి సెలవులు ప్రకటిస్తున్నట్లు హసన్‌పర్తి గురుకుల విద్యాలయ ప్రిన్సిపాల్ ఇందుమతి అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం అదనపు కలెక్టర్ గురుకులాన్ని పరిశీలించి కళాశాల, పాఠశాలలోని పరిస్థితులను అడిగారు. ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఇందుమతి పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని, ఏకధాటిగా వర్షం కురిస్తే సెలవులిచ్చి పిల్లల్ని ఇంటికి పంపిస్తున్నట్లు తెలిపారు. స్లాబులు పూర్తిగా దెబ్బతిని ఉండడం వల్ల ఉరుస్తున్నట్లు చెప్పారు. అనంతరం గురుకుల విద్యాలయ పరిసరాలను అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి పరిశీలించారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం సీజన్ వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఉన్నందున జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈసందర్భంగా నిత్యావసరాలను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిశీలన వేగిరం చేయాలి..
హసన్‌పర్తి తహసీల్దార్ కార్యాలయాన్ని అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా భూ– భారతి దరఖాస్తుల పరిశీలన తీరును సరి చూశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దరఖాస్తులు జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. మ్యుటేషన్‌తోపాటు సాదాబైనామాల దరఖాస్తులను వేర్వేగా పరిశీలించి వాటిని సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ చల్లా ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ రహీం, ఆర్‌ఐలు రాజేంద్రప్రసాద్, ఫాజిల్, సీనియర్ అసిస్టెంట్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
హసన్‌పర్తి గురుకుల
ప్రిన్సిపాల్ ఇందుమతి
అదనపు కలెక్టర్ దృష్టికి వాస్తవ పరిస్థితి