పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య | - | Sakshi
Sakshi News home page

పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య

Jul 28 2025 7:07 AM | Updated on Jul 28 2025 7:07 AM

పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య

పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య

పాఠ్యాంశాలు..

ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన కార్యక్రమం అండ్‌ ఎన్‌సీఎఫ్‌–ఎఫ్‌ఎస్‌ నిబంధనల ఆధారంగా ఉంటుంది. కార్యాచరణ ఆధారిత విద్యావిధానాలు, పర్యావరణంలోని అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యం. పిల్లలకు ఆరోగ్య, పోషణ, భద్రత ఉండేలా చూడాలి. మధ్యాహ్న భోజనం ఉంటుంది. వైద్య పరీక్షలు కూడా నిర్వహించాలి. అవసరమైన సామగ్రిని కొనాలి. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పర్యవేక్షణలో కొనుగోలు చేయవచ్చు.

విద్యారణ్యపురి: రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెక్షన్స్‌కు ఈ విద్యాసంవత్సరం అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లాలో రెండు దశల్లో కలిపి 48 ప్రభుత్వ పాఠశాలలకు మంజూరు లభించింది. ఇందులో ఇప్పటికే 16 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ సెక్షన్లు కొనసాగుతున్నాయి.

హనుమకొండ జిల్లాలో

మంజూరైన పాఠశాలలు..

ఎంపీపీఎస్‌ భీమదేవరపల్లి, ప్రభుత్వ హైస్కూల్‌ జులైవాడ, ఎంపీయూపీఎస్‌ మైలారం, శాయంపేట, గట్లనర్సింగాపూర్‌, ఎంపీపీఎస్‌ మడికొండ, ఎంపీపీఎస్‌ కుమ్మరిగూడెం, కొత్తపల్లి, పెద్దకోడెపాక, రసూల్‌పల్లి, పలివేల్పుల, ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌, ధర్మారం, యూపీఎస్‌ ఆర్‌ఈసీ పాఠక్‌, ఎంఏపీఎస్‌ కన్నారం, వంగర, ఎంపీయూపీఎస్‌ గోపాలపురం, ఎంపీపీఎస్‌ ఎర్రబెల్లి, గుండ్లసింగారం, యూపీఎస్‌ ముస్తాఫాపూర్‌, పరకాల, ఎంపీయూపీఎస్‌ మైలారం, ప్రగతిసింగారం, ఊరుగొండ, సీతారాంపూర్‌, ఎంపీయూపీఎస్‌ రత్నగిరి, మాణిక్యాపూర్‌, ఎస్సీకాలనీ ముల్కనూరు, ముల్కనూరు, బావుపేట, కేశవపూర్‌, ప్రభుత్వ పీఎస్‌ కాజీపేట, గొల్లపల్లి, పాలెం, ఎంపీయూపీఎస్‌ కనిపర్తి, ముప్పారం, కోమటిపల్లి, గోపాల్‌పూర్‌, శంభునిపల్లి, సోడాషపల్లి, హెచ్‌సీఎన్‌తండా, ప్రభుత్వ పీఎస్‌ ప్రాక్టీసింగ్‌ స్కూల్‌, రాంనగర్‌, మర్కజీ, ఎంపీపీఎస్‌ దామెర, వరికోలు, అక్కంపేటను ఎంపిక చేశారు.

వరంగల్‌ జిల్లాలో..

ఎంపీపీఎస్‌ వంచనగిరి, నాచినపల్లి, కాపులకనపర్తి, నెక్కొండ గర్‌ల్స్‌, వండ్లకొండ, పొనకల్‌, ఎంపీయూపీఎస్‌ డీసీతండా, చంద్రతండా, హనుమాన్‌దేవల్‌, రేకులతండా, అవుసలితండా, పెద్దమ్మగడ్డ, హాట్యాతండా, ముసుకులపల్లి, ఎంపీయూపీఎస్‌ డీసీ తండా అమీన్‌పేట్‌, ప్రభుత్వ యూపీఎస్‌ డీఎన్‌టీ బాలాజీనగర్‌, ప్రభుత్వ పీఎస్‌ దేశాయిపేట, నరేంద్రనగర్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ ముచ్చింపుల ఉన్నాయి. ఇప్పటికే మొదటిదశలో 13 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్స్‌ షురూ అయ్యాయి. మొత్తంగా వరంగల్‌ జిల్లాలో 32 ప్రీప్రైమరీ సెక్షన్స్‌కు మంజూరు లభించింది.

సదుపాయాలు..

పిల్లల విద్యాబోధనకు అనుకూలమైన ప్రత్యేక తరగతిగది ఉండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, ఆటసామగ్రి, సౌకర్యవంతమైన కాంతి, గాలిప్రవాహం అవసరం.

మానవ వనరులు..

ఒక్కో పాఠశాలలో ప్రీప్రైమరీ సెక్షన్‌కు ఒక ఇన్‌స్ట్రక్టర్‌, ఒక ఆయాను నియమించాలి. వీరిని తాత్కాలిక పద్ధతిలోనే ఎంపిక చేస్తారు. వీరికి పది నెలలపాటు మాత్రమే విధులుంటాయి. ఇన్‌స్ట్రక్టర్‌కు మాత్రం నెలకు రూ.10 వేల వేతనం ఉంటుంది.

తల్లిదండ్రులతో సమావేశాలు

తల్లిదండ్రుల సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంటుంది. వీటిని హెచ్‌ఎంలు పర్యవేక్షించాలి.

హనుమకొండ జిల్లాలో

రెండు దశల్లో 48,

వరంగల్‌ జిల్లాలో

మరో 19 స్కూళ్ల ఎంపిక

మార్గదర్శకాలు ఇలా..

2026–2027లో ఒకటో తరగతిలో చేరే అవకాశం ఉన్న పిల్లలను 2025–26 లో ప్రీప్రైమరీలో చేర్చాల్సి ఉంటుంది. ఆర్టీఈ చట్టానికి అనుగుణంగా వయస్సు, నిర్ధారణ పత్రాలు అవసరం. యూడైస్‌ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement