
జాతీయ రహదారితో జిల్లా అభివృద్ధి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
వరంగల్: జాతీయ రహదారి నిర్మాణంతో జిల్లా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. సంగెం మండలం తిమ్మాపూర్, గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామాల్లో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులతో బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఆర్బిటేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హైవే నిర్మాణంతో భవిష్యత్‌లో హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్‌ను చూడవచ్చని తెలిపారు. నేషనల్ హైవే యాక్ట్ ప్రకారం రైతులకు న్యాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, సంగెం, గీసుకొండ, తహసీల్దార్లు రాజ్‌కుమార్, రియాజొద్దీన్, రైతులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక అధికారులు
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు కోసం ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నర్సంపేట నియోజకవర్గానికి ఆర్డీఓ ఉమారాణి, వర్ధన్నపేటకు డీసీఓ ఎం.నీరజ, వరంగల్ తూర్పు నియోజకవర్గానికి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ కె.ప్రసన్నరాణిని నియమించింది.