
స్టీమ్ టు వందేభారత్..
172 వసంతాల భారతీయ రైల్వే సుదీర్ఘ ప్రయాణంలో కాజీపేట జంక్షన్ ప్రస్థానం
● ఏప్రిల్ 16 నుంచి 21వ తేదీ వరకు రైల్వే వారోత్సవాలు
● ప్రతిభ కనబరిచిన వారికి ఏటా అవార్డులు
● కాజీపేట జంక్షన్ నుంచి పలువురు ఎంపిక
కాజీపేట రైల్వే డీజిల్‌లోకోషెడ్ నిర్మాణం..
కాజీపేట రైల్వే డీజిల్‌లోకోషెడ్‌ను ఏప్రిల్ 21, 1973లో ప్రారంభించారు. నాటి నుంచి డీజిల్‌షెడ్ దినదినాభివృద్ధి సాధించి భారతీయ రైల్వేలో గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం షెడ్‌లో 240 ట్రాక్షన్, డీజిల్‌లోకోల నిర్వహణతో 715 మంది రైల్వే కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ షెడ్ నుంచి డిప్యుటేషన్‌పై ఇతర దేశాల రైల్వేకు డీజిల్‌షెడ్ కార్మికులు వెళ్తుంటారు. డీజిల్‌షెడ్ ఉత్తమ నిర్వహణ షెడ్‌గా రైల్వే జీఎం, రైల్వే బోర్డు, ఇతర రైల్వే అవార్డులను సొంతం చేసుకుంది.
కాజీపేట రూరల్ : భారతీయ రైల్వేకు నేటి(బుధవారం)తో 172 వసంతాలు పూర్తయ్యాయి. దేశంలో మొదటి రైలు 1853 ఏప్రిల్ 16వ తేదీన ముంబాయి–థానే మధ్య 34 కి.మీతో నడిపించారు. భారతీయ రైల్వే ప్రస్థానం మొదటి స్టీమ్ లోకోమోటివ్ నుంచి ప్రారంభమై.. ప్రస్తుతం డిజీల్‌లోకోమోటివ్, హాల్కోలోకోమోటివ్, ఎలక్ట్రిక్‌లోకోమోటివ్, వందేభారత్ రైళ్లతో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
కాజీపేట రైల్వే స్టేషన్ ఏర్పాటుకు శ్రీకారం..
కాజీపేట మీదుగా నిజాం స్టేట్ రైల్వే కంపెనీ లిమిటెడ్ అధికారులు సరుకు రవాణా కోసం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ వరకు సింగిల్‌లైన్ నిర్మించారు. 1904లో కాజీపేట రైల్వే స్టేషన్‌ను చిన్న షెడ్డుతో ప్రారంభించారు. తర్వాత కాజీపేట–సికింద్రాబాద్ రైల్వే లైన్ నిర్మాణం జరిగింది. 1917లో కాజీపేటలో రైల్వే స్టీమ్‌లోకోషెడ్‌ను ఏర్పాటు చేశారు. డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల వినియోగంతో 1991లో స్టీమ్‌లోకోషెడ్ మూతబడింది. 1923లో కాజీపేట రైల్వే స్టేషన్ జంక్షన్‌గా మారింది. 1917లో విజయవాడ–బల్హార్షా మధ్య కాజీపేట మీదుగా డబుల్‌లైన్ ఏర్పాటైంది. కాజీపేట–బల్హార్షా మధ్య మూడో రైల్వే లైన్ కూడా పూర్తి కావొస్తుంది. కాజీపేట కేంద్రంగా 1992లో ఎలక్ట్రిక్‌లైన్ నిర్మాణం జరిగింది. 1970 వరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వేతో సంయుక్తంగా ఆర్టీసీ కండక్టర్ల నియామకం చేపట్టింది. అప్పట్లో వీరి కోసం కాజీపేట జంక్షన్‌లో క్వార్టర్స్‌ను కూడా నిర్మించారు. కాజీపేట నుంచి రోజూ 170 రైళ్లు రాకపోకలు, 15 వేల మంది రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు రూ.సుమారు 12 లక్షల ఆదాయం వస్తోంది. కాజీపేట కేంద్రంగా సుమారు 5 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. కాజీపేట యంత్రాంగం బల్హార్షా మాణిక్ ఘర్, విజయవాడ వద్ద కొండపల్లి, కరీంనగర్ రూట్‌లో జగిత్యాల, సికింద్రాబాద్ రూట్‌లో భువనగిరి వరకు విస్తరించి ఉంది. ప్రస్తుతం కాజీపేట రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ స్కీం రీ–డెవలప్‌మెంట్ వర్క్స్‌తో ప్రపంచస్థాయి రైల్వే స్టేషన్‌గా అత్యాధునీకరిస్తున్నారు. కొన్ని నెలల్లో కాజీపేట కేంద్రంగా నిర్మిస్తున్న రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ, వ్యాగన్‌షెడ్‌లు ప్రారంభం కానున్నాయి. దీంతో కాజీపేట జంక్షన్ ప్రాముఖ్యత మరింత పెరగనుంది.
కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్‌లోకోషెడ్ నిర్మాణం..
కాజీపేటలో 2004లో రైల్వే ఎలక్ట్రిక్‌లోకోషెడ్ నిర్మాణం జరిగింది. మొదట ఈ షెడ్ 100 లోకోమోటివ్‌ల నిర్వహణ సామర్థ్యంతో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 205 లోకోల నిర్వహణతో సుమారు 420 మంది రైల్వే సిబ్బందితో షెడ్ నిర్వహణ జరుగుతోంది. దినదినాభివృద్ధి చెంది ఈ షెడ్ దక్షిణ మధ్య రైల్వేలో ప్రత్యేక గుర్తింపు సాధించి ఎన్నో రైల్వే అవార్డులు కై వసం చేసుకుంది.
మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టాలపైకి రైళ్లు..
సాంకేతిక విప్లవం దినదినాభివృద్ధి చెంది స్టీమ్‌లోకోమోటివ్ నుంచి డీజిల్‌లోకోమోటివ్, డబ్ల్యూడీఎం–2, 3, 4, 6 (కంప్యూటరైజ్‌డ్‌లోకోమోటివ్), తర్వాత ఎలక్ట్రిక్‌లోమోటివ్, ఎలక్ట్రిక్‌లోకోమోటివ్‌లో అమెరికా టెక్నాలజీతో డబ్ల్యూఎపీ–2, 4, 7, డబ్ల్యూఎజీ– 5, డబ్ల్యూఎపీ–12 లోకోమోటివ్‌లు వచ్చాయి. తర్వాత వందేభారత్ రైలు 130 కేఎంపీహెచ్ స్పీడ్‌తో పట్టాలపై పరుగులు పెడుతోంది. రైల్వే శాఖ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్యాసింజర్ నుంచి ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫ్టాస్, సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టి తక్కువ ఖర్చుతో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంది. 1853, ఏప్రిల్ 16న మొదటి రైలు ప్రారంభమైనప్పటి నుంచి ఏటా రైల్వే వీక్ అవార్డుల వారోత్సవాల పేరిట విధుల్లో ప్రతిభ కనబరిచిన రైల్వే అధికారులు, కార్మికులకు అవార్డులు, నగదు పురస్కార్, ప్రశంస పత్రాలు ప్రదానం చేసి వారిని ప్రోత్సహిస్తోంది. కాజీపేట జంక్షన్ నుంచి కూడా ఈ ఏడాది పలువురు రైల్వే అవార్డులకు ఎంపికై నట్లు అఽధికారులు తెలిపారు.

స్టీమ్ టు వందేభారత్..

స్టీమ్ టు వందేభారత్..

స్టీమ్ టు వందేభారత్..

స్టీమ్ టు వందేభారత్..