కాపులే లక్ష్యం.. దాడులే సాక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాపులే లక్ష్యం.. దాడులే సాక్ష్యం

May 24 2026 1:27 AM | Updated on May 24 2026 1:27 AM

ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026 కాపులే లక్ష్యం.. దాడులే సాక్ష్యం జీవితం నాశనం నిమ్మకాయల ధరలు సాగర్‌ నీటిమట్టం ● ఇటీవలే ప్రత్తిపాడు నియోజకవర్గం ముట్లూరులో జనసేనకు చెందిన కాపు యువకులను టార్గెట్‌ చేసి దాడులు చేశారు. ఊరి శివారు నుంచి గ్రామ నడి బొడ్డు వరకూ కాపులను కొట్టుకుంటూ వచ్చి రెచ్చిపోయారు. చివరికి విషయం కాపు సంఘ నేతల వద్దకు చేరడం, వారు కేంద్ర మంత్రి వద్ద పంచాయతీ చేయడంతో ఎట్టకేలకు ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఆ ప్రజాప్రతినిధిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ● తాజాగా కొల్లూరులో నూడిల్స్‌ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్న జనసైనికుడు ఉప్పు జానకిరామయ్యపై టీడీపీ నాయకుడైన మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్‌ ప్రసాద్‌ను విమర్శించారనే సాకుతో దాడి చేశారు. రాత్రి తన ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్‌ను మూసి వేసి ఇంటికి వెళుతున్న జానకిరామయ్యపై టీడీపీ నాయకుడి అనుచరులైన కొల్లూరు ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తులు మద్యం సీసాతో తలపై దాడి చేశారు. తలకు గాయమయిన వెంటనే తన బంధువులు, స్నేహితుల సాయంతో ఫిర్యాదు చేసేందుకు కొల్లూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లిన జానకి రామయ్యను పోలీసులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. తెనాలి తరలించేందుకు 108 వాహనం వస్తున్న సమయంలో పోలీసు స్టేషన్‌ను ఆనుకొని ఉన్న ఎస్సీ ఏరియా నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు పోలీసు స్టేషన్‌పై దాడికి దిగారు. పోలీసులతోపాటు, బాధితుడు జానకిరామయ్య, వారి బంధువులపై విచక్షణరహితంగా దాడికి దిగారు. ఆఖరికి పోలీసుల జీపును కూడా తగులబెట్టే ప్రయత్నం చేయడం కలకలం రేపింది. ‘కాపు నా కొడుకులు కనపడితే కొట్టండి’ అంటూ తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. ఆఖరికి మహిళను కూడా వదలలేదు.

న్యూస్‌రీల్‌

జనసేన అయినా, వైఎస్సార్‌సీపీ అయినా వారే కాపు నేతలే టార్గెట్‌ ఎక్కడున్నా కాపులను వెంటాడుతున్న తెలుగుదేశం నేతలు ఉమ్మడి గుంటూరులో కాపులపై పెరుగుతున్న దాడులు జనసేన నేతల తీవ్ర ఆగ్రహం తాము తిరగబడితే మూట గట్టి తీసుకెళ్తామని హెచ్చరిక

కాపాడేవారూ ఉండరు...

గుంటూరు
ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026
జీవితం నాశనం

తెనాలి: స్థానిక మార్కెట్‌ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ఠ ధర రూ.3,200, గరిష్ఠ ధర రూ.6,500, మోడల్‌ ధర రూ.4,400 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 523.90 అడుగులకు చేరింది. జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదల అవుతోంది.

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు నేతలు, కార్యకర్తలను తెలుగుదేశం నేతలు టార్గెట్‌ చేశారు. 2024 ఎన్నికల్లో వారి సహకారంతోనే గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత తన అసలు రంగు బయట పెడుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీని తొక్కేయడమే లక్ష్యంగా తెలుగుదేశం నేతలు పనిచేస్తున్నారని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. జనసేనకి, కాపులకు ఎటువంటి పనులు చేయవద్దని అధికారులకు కూడా మౌఖికంగా ఎక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు.

ఇవిగో నిదర్శనాలు

గతంలో అంబటిపైనా..

ఇటీవల కాపు సామాజికవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై, కార్యాలయంపై దాడి చేసి ఏడున్నర గంటలకుపైగా విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడికి గురైన అంబటి రాంబాబుపైనే తప్పుడు కేసులు బనాయించారు. అనంతరం జైలులో పెట్టిన విషయం కూడా జిల్లా వాసులు మర్చిపోలేదు. మొక్కజొన్నకు మద్దతు ధర లేకపోవడంతో ఒక గోడౌన్‌లో నిలవ ఉంచిన ఘటనలో తెలుగుదేశం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన మామిళ్లపల్లి రైతులపై దాడి చేయించారు. దాడి చేసిందే కాక మహిళలపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. రైతులను పరామర్శించడానికి వస్తున్న నేతలను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటోంది. అరెస్టులు, దౌర్జన్యాలకు పాల్పడటం నిత్యకృత్యంగా మారింది. అచ్చంపేట మండలానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సహచరుడి పొలాన్ని ఆక్రమించుకుని అందులో మట్టి తవ్వేశారు. పర్చూరు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు ఎమ్మెల్యేను కలవడానికి వెళ్తే కలవకపోగా ‘లేబర్‌ వాళ్లు. తర్వాత కలుద్దాంలే’ అని అవమానించినట్లు కాపు నేతలు చెబుతున్నారు. ‘కాపులకు ఏ రకమైన పథకాలు లేవు. కూటమి ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌కు రూ.రెండు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కాపు జేఏసీ నేత దాసరి రాము ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు.

7

జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకు తీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తమ సహనాన్ని చేతగానితనంగా భావించి దాడులకు పురిగొల్పడం, చేయడం వంటి దుశ్చర్యలను మానుకోవాలన్నారు. తాము తిరగబడితే కాపాడే వారు కూడా ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకొని మసలుకుంటే మంచిదని హితబోధ చేశారు. పార్టీ సిద్ధాంతాలను తాము మర్చిపోతే పోలీసు స్టేషన్‌లోకి దూరి మీరు జనసైనికులను, కాపు కులస్తులను కొట్టినట్టుగా, తాము ఇంటింటికి వచ్చి కొట్టడం పెద్ద విషయం కాదన్నారు. నడిపించే నాయకులు, వారి అనుచరుల విషయంలో తామూ దాడులకు దిగడానికి వెనకాడబోమన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. దాడి ఘటనలో తమ పార్టీకి చెందిన వ్యక్తులపైన సైతం కేసులు నమోదు చేశారని, వారికి అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. ఆందోళన వద్దని సూచించారు.

శనివారం కొల్లూరులో జరిగిన దాడిలో గాయపడిన ఉప్పు జానకి రామయ్య మేనల్లుడు రాము బాల శివ గంగాధర్‌ (బాలు) మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ కోసం తన జీవితాన్ని నాశనం చేసుకున్నానన్నారు. విదేశాలకు వెళ్లాల్సిన తాను తెలుగుదేశం పార్టీ వాళ్లు పెట్టిన కేసుల వల్ల వెళ్లలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసైనికులను.. ప్రత్యేకించి కాపు కులస్తులపై దాడులకు తెగబడితే మూకలను మూట గట్టుకుతీసుకువెళ్లడానికి ఎంతో సమయం పట్టదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement