ఇదేమి టెన్షన్‌ గురు..! | - | Sakshi
Sakshi News home page

ఇదేమి టెన్షన్‌ గురు..!

May 22 2026 4:16 AM | Updated on May 22 2026 4:16 AM

ఇదేమి టెన్షన్‌ గురు..! గుంటూరు ఎడ్యుకేషన్‌ ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయుల్లోనే 2010 కంటే ముందు ఉద్యోగం సాధించిన వారిలో ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న వారు మినహా ఆపైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్‌ ఉత్తీర్ణులు కావాలి. 2010 ఆగస్టు నాటికి సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్‌ తప్పనిసరి. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) గుర్తింపు పొందాలన్నా టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయస్సులో టెట్‌ రాసి ఉత్తీర్ణత ఎలా సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధం కావాలా అనే సందిగ్ధంలో పడ్డారు. గురువుల భవితకు సుప్రీంతీర్పు ’పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్లలోపు టెట్‌ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా, కోర్టులో అప్పీలు చేయకుండా మిన్నకుండడంపై ఉపాధ్యాయులు, సంఘ నాయుకులు మండిపడుతున్నారు. టెట్‌ నుంచి ఉపశమనం కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ విస్మరించడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ సైతం వృత్తిలో ఉన్న టీచర్లు టెట్‌ అర్హత కలిగి ఉండాలనే ఉత్తర్వులు ఎక్కడా ఇవ్వలేదని స్పష్టం చేస్తున్నారు. టెట్‌ పరీక్షకు సంబంధించి ఉపాధ్యాయులు వినతులివ్వగా ఉపశమనం కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేశ్‌ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగోన్నతికి టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలి

ఉపాధ్యాయులు తప్పనిపరిగా టెట్‌ రాసి ఉత్తర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ వేయాలి. 20, 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన టీచర్లను ఇప్పుడు టెట్‌ రాసి ఉత్తర్ణత సాధించాలనడం ఒత్తిడికి గురిచేస్తోంది. ఉద్యోగోన్నతులకు టెట్‌లో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదు. బీఈడీ, డీఈడీ పూర్తి చేసి, డీఎస్సీతో ఎంపికై న వారికి టెట్‌ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సవరించాలి.

ఇన్‌ సర్వీసు వారిని మినహాయించాలి

టెట్‌ నోటిఫికేషన్‌లో ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి. రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009 ప్రకారం 2011కు ముందు టెట్‌ అమలులో లేదు. టెట్‌ అమలులోకి రాకముందు నియాకమైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.

పట్టించుకోని చంద్రబాబు సర్కారు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఉత్తీర్ణత సాధించడం ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. టీచర్లు ప్రస్తుత సర్వీసు కొనసాగించాలన్నా, ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 15 వేల మంది ఉపాధ్యాయులు పని చేస్తుండగా, వారిలో దాదాపు ఎనిమిది వేల మంది టెట్‌ రాయాల్సి ఉంటుందని అంచనా. మినహాయింపునకు విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ ఇచ్చిన హామీ నేటికీ అమలు కాకపోవడంతో ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

– వై.థామస్‌రెడ్డి, వైఎస్సార్‌ టీచర్స్‌

అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

– ఎం.కళాధర్‌,

యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement