గుంటూరు రూరల్: కార్పొరేషన్ పరిధిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీకోసం తీసుకు వచ్చిన యూజీసీ పైపులు గురువారం అగ్నికి ఆహుతయ్యాయి. నగర శివారు ఇన్నర్ రింగ్‌రోడ్డు సమీపంలోని ప్రకాష్‌నగర్ సమీపంలో ఖాళీ స్థలాల్లో షాపూజీ పల్లోంజీ సంస్థకు చెందిన ప్లాస్టిక్ పైపులు 2019లో నిల్వ చేశారు. గురువారం ఉదయం పైపులకు నిప్పు అంటుకుని ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు వ్యాపించటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా నాలుగు ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది సుమారు ఐదు గంటలకుపైగా కష్టపడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఫైర్ సిబ్బంది తెలిపారు. అనంతరం షాపూర్‌జీ పల్లోంజీ ప్రతినిధులు అగ్ని ప్రమాదంలో సుమారు రూ.86 లక్షలు విలువ చేసే ప్లాస్టిక్ యూజీసీ పైపులు దహనమయ్యాయని సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారని నల్లపాడు సీఐ భాస్కర్ తెలిపారు.


