న్యూస్‌రీల్
సాగర్ నీటిమట్టం
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026
వారధికి కుస్తీ.. నాణ్యత నాస్తి
● కాంటీలివర్ లేకుండా అంత
పొడవు ఎలా కట్టారో!
● దేశంలోనే తొలిసారి అంటూ గొప్పలు
● సబ్ కాంట్రాక్టు ఇచ్చి కట్టిస్తున్న
టెండర్ పొందిన కంపెనీ
● స్లాబ్ దశకు వచ్చే వరకు
పర్యవేక్షణ కరువు
● అనుమానాలకు తావిస్తున్న
నిర్మాణ పనుల తీరు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉండవల్లిలో నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు నాసిరకంగా సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం రెండు మిల్లీమీటర్ల మేర తేడా వచ్చిందని కట్టిన బ్రిడ్జి మొత్తాన్ని తొలగిస్తుండటం ఈ అనుమానాలకు కారణం. మొత్తం నాలుగు లైన్లుగా నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణంలో దక్షిణ భాగంలో నిర్మించిన గడ్డర్లు వంకరపోయాయి. ఈ బ్రిడ్జిని మున్సిపల్ మంత్రి నారాయణతోపాటు అధికారులు పలు దఫాలుగా పరిశీలించి అద్బుతం అంటూ కితాబు ఇచ్చారు. అయితే దక్షిణ భాగంలో నిర్మించిన రెండో వంతెనలో మధ్యలో ఏర్పాటు చేసిన గడ్డర్లు ఒకవైపునకు వంగిపోయాయి. దీనిపై శ్లాబ్ వేస్తే ఇబ్బంది వస్తుందన్న ఉద్దేశంతో దాన్ని సరిచేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో బుధవారం నుంచి గడ్డర్ల తొలగింపు పనులు చేపట్టారు. ఇప్పటికే రెండు గడ్డర్లను తొలగించారు. మరో గడ్డర్‌ను తొలగించడానికి సన్నాహాలు చేశారు. అయితే దీని నాణ్యతపై పత్రికల్లో వచ్చిన వార్తలతో అన్ని రాజకీయపక్షాలు బ్రిడ్జిని సందర్శించి నిలదీస్తుండటంతో తాత్కాలికంగా తొలగింపు ప్రక్రియను నిలిపివేశారు.
బకింగ్‌హాం కెనాల్‌కు రెండువైపులా పిల్లర్లు వేసి దీనిపై స్టీల్ బ్రిడ్జిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ కాంట్రాక్టు ఎన్‌సీసీ సంస్థ దక్కించుకోగా, పిల్లర్లు మాత్రం సబ్ కాంట్రాక్టు ఇచ్చి చేయించారు. పూర్తిస్థాయిలో బేరింగులు వేయకుండానే గడ్డర్లను నిలబెట్టే ప్రయత్నం చేయడం, బ్రిడ్జి పొడవు ఎక్కువ ఉండటంతో శ్లాబ్ వేయకుండానే ఇవి కుంగిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. ఎక్కడైనా పొడవైన స్టీల్ బ్రిడ్జిలు వేసేటప్పుడు కాంటీలివర్‌తో ఏర్పాటు చేస్తారని, ఇక్కడ దీనికి భిన్నంగా కొత్త టెక్నాలజీ అంటూ సుమారు రూ.64 కోట్ల పనులు చేపట్టారు. బ్రిడ్జి నిర్మాణంలో ఒక్కొక్క బ్రిడ్జికి 4 ఐరన్ గడ్డర్స్ వినియోగించారు. శ్లాబ్ వేసేందుకు రాడ్ బెండింగ్ నిర్మాణం పూర్తిచేసి శ్లాబ్ వేసే సమయంలో కాలువ మధ్యలో ఏర్పాటు చేసిన ఒక గడ్డర్ పక్కకు వంగినట్లు ఇంజనీరింగ్ అధికారులు గుర్తించారు. గురువారం ఒక గడ్డర్‌ను విడదీయగా, రెండవ గడ్డర్ వద్ద కూడా డీవియేషన్ ఉన్నట్లు గుర్తించి పక్కన పెట్టారు. మూడవ గడ్డర్‌ను విప్పదీయడానికి పనులు చేస్తున్నట్లు అక్కడి సిబ్బంది చెబుతున్నారు. చిన్నపాటి లోపం అని చెబుతూనే మొత్తం గడ్డర్లు తీసి మళ్లీ బిగించడానికి ప్రయత్నాలు చేయడంతో నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇటీవల కుంగిన స్టీల్ బ్రిడ్జి
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 524.10 అడుగులకు చేరింది. ఇది 156.8580 టీఎంసీలకు సమానం.
అసలు సీడ్ యాక్సెస్ రోడ్డును మణిపాల్ అసుపత్రి వద్ద హైవేకు కనెక్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కొండపక్కన ట్రాఫిక్‌తో కిక్కిరిసిన ప్రాంతం వద్ద కలపాల్సిన అవసరం ఏంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాంట్రాక్టు పొందిన సంస్థలు పనులు చేయకుండా అనుభవం లేనివారికి సబ్ కాంట్రాక్టు ఇచ్చి పనులు చేయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సంస్థలను నియంత్రించే స్థాయిలో సీఆర్‌డీఏ లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మున్సిపల్ మంత్రి కనీసం ఈ ప్రాంతాన్ని సందర్శించలేదు. మరోవైపు జూన్ నాటికి ఈ పనులు పూర్తి కాకపోతే గుంటూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీరు, సాగునీరు సక్రమంగా అందే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


