దుగ్గిరాల: మనం ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని కాపాడాలని గుంటూరు జిల్లా కలెక్టరు సి.ఎం. సాయికాంత్ వర్మ అన్నారు. శనివారం దుగ్గిరాల మండల కేంద్రం ఎస్‌డబ్ల్యూపీసీలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ఆవరణలో మామిడి మొక్కను నాటారు. స్వచ్ఛ రథం పనితీరు పరిశీలించారు. బొర్రా శివ నాగేశ్వరమ్మ అనే మహిళ మాట్లాడుతూ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గిట్టుబాటు ధరలేక ఇంత వరకు పంట విక్రయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టరు ఆమెకు వివరించారు. ప్లాస్టిక్ కోసం తెచ్చిన నూతన పరికరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను పరిశీలించారు. ప్లాస్టిక్‌ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రజలు సహకారం అందించాలన్నారు. కాలువలు ఉన్నందున పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చివరిగా స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీపీఓ నాగసాయి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి, డ్వామా పీడీ పి.శంకర్, మండల ప్రత్యేక అధికారి మార్కెఫెడ్ డీఎం నరసింహోరెడ్డి, డీఎల్పీఓ శ్రీదేవి, ఆర్డీఓ లక్ష్మీకుమారి, తహసీల్దారు సునీత, ఎంపీడీఓ ఎ.శ్రీనివాస రావు, డిప్యూటీ ఎంపీడీఓ కె.జె.నెహ్రూ, మండల పరిషత్ ఏఓ చంద్రమోహన్, సీసీఎల్ ప్రతినిధి బలరాం, పంచాయతీ కార్యదర్శి టి.మురళీకృష్ణ, కె.శ్రీఅనిత, ఏవో ఆర్.విజయబాబు, గద్దె వాసు, కొంగర జోగేంద్ర ప్రసాదు, వల్లూరి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.


