లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోండి

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

లోక్‌ అదాలత్‌ సద్వినియోగం చేసుకోండి

గుంటూరు లీగల్‌: సమాధాన్‌ సమరో 2026లో భాగంగా సుప్రీంకోర్టు ఆగస్టు 21, 22, 23 తేదీలలో నిర్వహించే ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ సూచించారు. శనివారం గుంటూరులో అవగాహన సదస్సులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. గుంటూరులోని చుట్టుగుంట సెంటర్‌, హౌసింగ్‌ బోర్డు కాలనీ సెంటర్‌, పేరేచెర్ల సెంటర్‌, మేడికొండూరు సెంటర్‌లలో ఈ ర్యాలీ చేశారు. అన్ని సెంటర్‌లలో ప్రజలకు అవగాహన కల్పించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించుకోడానికి లోక్‌ అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రజలకు అందే న్యాయ పరమైన చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement