సిప్‌ పనులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి | - | Sakshi
Sakshi News home page

సిప్‌ పనులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్ధసారధి

తాడికొండ: రాజధాని అమరావతి గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన (కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌) మూలధన పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టు పనులు లక్ష్యాలను సాధించాలని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీమతి డి.లక్షీ పార్థసారథి అధికారులను ఆదేశించారు. శనివారం రాజధాని గ్రామాలైన మల్కాపురం, మందడం, కృష్ణాయపాలెం, ఎరబ్రాలెం, రాయపూడి ప్రాంతాలలో జరుగుతున్న సిప్‌ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాజధాని గ్రామాల ప్రజలకు మంచినీటి సరఫరా, చెరువుల సుందరీకరణ, వర్షపు నీరు – మురుగునీటి కాలువల నిర్మాణం, వీధి దీపాల కల్పనలకు ఇంజినీరింగ్‌ అధికారులు సముచిత స్థానం కల్పించాలన్నారు. మందడంలో అభివృద్ధి పనులు జరుగుతుండగా ప్రధాన రహదారిపై జరుగుతున్న వాటర్‌ పైపులైన్‌ పనులను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర సచివాలయానికి ప్రధాన మార్గం కావటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఛీఫ్‌ ఇంజినీరు సీహెచ్‌ ధనుంజయకు సూచించారు. కృష్ణాయపాలెంలో గ్రామ అభివృద్ధి పనులు చేస్తుండగా ప్రధాన కూడలి వద్ద జరుగుతన్న హైమాస్ట్‌ దీపాల ఏర్పాటు పనులను పరిశీలించి మరో 10 రోజులలో వీటిని అందుబాటులోనికి తీసుకురావాలని ఎస్‌ఈ ఆర్‌.హనుమంతరెడ్డిని ఆదేశించారు. అనంతరం ఎరబ్రాలెంలో, రాయపూడి గ్రామంలో జరుగుతున్న సిప్‌ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు.

జీజీహెచ్‌లో రోగులకు అపరిశుభ్ర ఆహారం

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు పంపిణీ చేసే కోడిగుడ్లపై ఈగలు వాడడం శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రోగులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేలా చూడాల్సిన పర్యవేక్షణ చేయాల్సిన సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ, చీఫ్‌ డైటీషియన్‌, డైటీషియన్‌, ఇతర అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుండిపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement