దుగ్గిరాల: ఇంటర్ మార్కుల విషయంలో తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదు అంటోంది ఇంటర్ విద్యార్థిని కార్లపూడి కావ్య. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా మంగళగిరి నియాజకవర్గం రేవేంద్రపాడు గ్రామంలో హారిక జూనియర్ ఇంటర్ కళాశాలలో నూతక్కి గ్రామానికి చెందిన కావ్య ఇంటర్ బైపీసీ రెండో ఏడాది పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూడసాగింది. ఫలితాల రోజున ఇంటర్ సెకండియర్ బోటనీ పరీక్షలో కేవలం 5 మార్కులే రావడం చూసి హతాశురాలయింది. అయితే తాను పరీక్ష రాసిన విధానంపై నమ్మకం ఉంచిన కావ్య కుంగిపోకుండా రీవెరిఫికేషిన్‌కు ఫీజు కట్టింది. రీవెరిఫికేషిన్‌లో 60కి 60 మార్కులు వచ్చాయి. కావ్య ‘సాక్షి’తో మాట్లాడుతూ పరీక్ష ఫలితాల రోజు తాను చాలా ఒత్తిడికి లోనయ్యానని, బోటనీ తప్ప అన్నిటిల్లో మంచి మార్కులు వచ్చాయని, అయితే తాను పరీక్ష రాసిన విధానంపై నమ్మకంతో రీవెరిఫికేషిన్‌కు అప్లయి చేశానని, అందులో పూర్తిగా 60 మార్కులు వచ్చాయని ఆనందం వ్యక్తం చేసింది. మార్కుల విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు డొల్లతనం మరోసారి బయటపడినట్లయింది. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇంటర్ బోర్డు వైఖరిని పలువురు మేధావులు తప్పుపడుతున్నారు.
మొదట 5.. తర్వాత 60
May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM
● బయటపడిన ఇంటర్ బోర్డు డొల్లతనం
● సెకండియర్ బోటనీ పరీక్షలో తొలుత 5 మార్కులు..
● కుంగిపోకుండా రీవెరిఫికేషన్‌కు అప్లయి చేసిన విద్యార్థిని కావ్య
● రీవెరిఫికేషన్‌లో 60కి 60 మార్కులు సాధించిన వైనం
Advertisement


