ఉచిత బసే్సది బాబూ? | - | Sakshi
Sakshi News home page

ఉచిత బసే్సది బాబూ?

May 15 2026 10:08 AM | Updated on May 15 2026 10:08 AM

శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026 ఉచిత బసే్సది బాబూ? ● చంద్రబాబు సర్కారు నిర్వాకంతో ప్రయాణికుల కు అవస్థలు ● సర్వీసులు సరిపడా లేక మహిళలకూ తప్పని కష్టాలు ● పురుషులకు, విద్యార్థులు బస్సులో కనీసం ఎక్కలేని దుస్థితి ● పరిష్కారం దిశగా చర్యలు చేపట్టని పాలకులు 21 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు నరసరావుపేట: జిల్లాలో ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నామని డీఆర్‌ఓ నారదముని వెల్లడించారు. సప్లిమెంటరీ పరీక్షలపై సమన్వయ సమావేశం గురువారం కలెక్టర్‌ కార్యాలయంలో డీఆర్‌ఓ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ జిల్లాలో మొదటి, రెండవ సంవత్సరం విద్యార్థులు మొత్తం 17,572 మంది పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఇంటర్మీడియెట్‌ తొలి ఏడాది 10,789, ద్వితీయ సంవత్సరం 6,783 మందికి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 32 కేంద్రాలలో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. సమావేశంలో డీఈసీ సభ్యులు కె.వేణు, కేటీటీవీ రమణ, డీఈఓ, ఏపీఎస్‌ ఆర్‌టీసీ, ఏపీసీపీడీసీఎల్‌, డీఎంహెచ్‌ఓ, ఎల్‌డీఎం, పోలీసు, తపాలా, మున్సిపల్‌ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 17న చదరంగం పోటీలు టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఏపీ పోలీసుల ప్రతిభ సాగర్‌ నీటిమట్టం పట్నంబజారు: గుంటూరు రీజియన్‌ పరిధిలో మొత్తం 412 బస్సులు ఉన్నాయి. అందులో 97 అద్దె బస్సులు, 215 పల్లె వెలుగు, 41 ఆల్ట్రా డీలక్స్‌, 44 సూపర్‌ లగ్జరీ, 12 ఇంద్ర, 4 అమరావతి స్కానియా ఉన్నాయి. గుంటూరు జిల్లాకు సంబంధించి నిత్యం లక్షకుపైగా మంది ఆర్టీసీ సేవలు వినియోగించుకుంటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అందులో 60 శాతానికిపైగా మహిళలే ఉంటున్నారు. గుంటూరు కేంద్రంగా నిత్యం అనేక ప్రాంతాలకు మహిళా ఉద్యోగులు, ఆయా పనులు చేసుకునే వారు, వ్యాపారం చేసే మహిళలు రాకపోకలు సాగిస్తున్నారు. వీరితోపాటు విద్యార్థులు, ఉద్యోగాలు చేసుకునే యువత కూడా అధికంగానే ఉన్నారు. నియోజకవర్గాలవారీగా మహిళల సంఖ్య చూస్తే గుంటూరు తూర్పులో 1.50 లక్షలు, గుంటూరు పశ్చిమలో 1.30 లక్షలు, తెనాలిలో 1.41 లక్షలు, పొన్నూరులో 1.15 లక్షలు, తాడికొండలో 1.60 లక్షలు, మంగళగిరిలో 2.03 లక్షలు, ప్రత్తిపాడులో 1.45 లక్షలు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. సుమారుగా జిల్లాలో 10 లక్షల మందికిపైగా మహిళలు ఉన్నారు. జిల్లాలో గుంటూరు 1, 2 డిపోలతోపాటు తెనాలి, పొన్నూరు, మంగళగిరి డిపోలు ఉన్నాయి. రీజియన్‌ పరిధిలో ఐదు డిపోలతోపాటు ఏడు నియోజకవర్గాల నుంచి అధికంగా మహిళలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. నిత్యం ఆర్టీసీ ఆదాయం రూ.కోటి వరకు ఉంటోంది. పండగలు, ఇతరత్రా రద్దీ రోజుల్లో రూ. 1. 25 కోట్ల ఆదాయం సమకూరుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో పూణెకు చెందిన పినాకిల్‌ కంపెనీ ఎలక్ట్రికల్‌ బస్సులు నడిపేందుకు అనుమతులు ఇచ్చేసింది. దీనిలో భాగంగా సువిశాలమైన నాలుగు ఎకరాలు ఉన్న గుంటూరు డిపో 2ను ఇప్పటికే పినాకిల్‌ కంపెనీకి కేటాయించారు. గుంటూరు జిల్లాలోని ఐదు డిపోల్లో కేవలం లాభాలు వచ్చే ఏకై క డిపో గుంటూరు 2 మాత్రమే. ఈ క్రమంలో డిపోనకు చెందిన బస్సులను ఇతర డిపోలకు కేటాయించారు. డిపో 1కు 19, తెనాలికి 9, మంగళగిరి 23, పొన్నూరుకు 4 కలిపి ఇప్పటికే 46 బస్సులను కేటాయింపు పూర్తయింది. సుమారు 100కుపైగా ఉన్న డిపో 2 బస్సులను ఇతర డిపోలకే కేటాయించే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మహిళలకు కూడా ఉచిత ప్రయాణం ఇబ్బందికరంగానే మారింది. ఎలక్ట్రికల్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. రిమాండ్‌ ఖైదీ పరారీ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్‌

న్యూస్‌రీల్‌

చిత్తశుద్ధి లేని హామీ అమలు తీరుతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

పీపీపీ విధానంలో...

బస్సుల సంఖ్య పెంచని ప్రభుత్వం

మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్నామని గొప్పగా చెప్పుకొంటున్న ప్రభుత్వం సాధారణ ప్రయాణికుల కష్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచడం లేదు. దీంతో టికెట్‌ తీసుకుని బస్సు ఎక్కిన వారికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. టికెట్‌ లేకపోవడంతో మహిళలు సీట్లు ఖాళీ లేకపోయినా బస్సెక్కుతున్నారు. నిల్చొని ప్రయాణం చేస్తున్నారు. పురుషులు టికెట్లు తీసుకుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని బస్సులలో కనీసం నిలబడే జాగా ఉండటం లేదు. సీట్ల కోసం ప్రయాణికుల మధ్య తరచుగా తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఒక్కోసారి రెండు మూడు గంటలపాటు నిలబడే ప్రయాణం చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మాచర్ల, రేపల్లె, వినుకొండ ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది.

నిమ్మకాయల ధరలు

పులిచింతల సమాచారం

దుర్గమ్మకు భక్తుల విరాళాలు

పారా లీగల్‌ వలంటీర్లకు శిక్షణ

గుంటూరు
శుక్రవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026

● పారిపోతుండగా రోడ్డు ప్రమాదానికి గురైన నిందితుడు

● గాయపడటంతో బయటపడిన అసలు విషయం

7

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): గుంటూరు జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన మెన్‌ అండ్‌ ఉమెన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సెలక్షన్‌ పోటీలు స్థానిక శ్యామలానగర్‌లోని వెంకటేశ్వర బాలకుటీర్‌లో నిర్వహిస్తామని పోటీల నిర్వాహకుడు పి.విజయ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వయస్సుతో నిమిత్తం లేకుండా చెస్‌ వచ్చిన ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఎంపిక చేసిన టీమ్‌ను ఈ నెల 27న బాటప్లలో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. పోటీలకు సంబంధించిన బ్రోచర్‌ను జిల్లా చెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ిసీహెచ్‌ రవీంద్ర రాజు, బాలకుటీర్‌ సీఏఓ దుర్గా రఘురామ్‌, ప్రిన్సిపల్‌ సుధామాధవి, విజయ్‌కుమార్‌ తదితరులు ఆవిష్కరించారు.

మంగళగిరి టౌన్‌: ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన అఖిల భారత టేబుల్‌ టెన్నిస్‌ పోటీలలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ బృందం ప్రతిభ కనబరిచింది. ఏపీ ఈగల్‌ బృందం గురువారం వివరాలను వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఏపీ ఈగల్‌ బృందం రెండు కాంస్య పతకాలను సాధించినట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ తరఫున పోటీల్లో పాల్గొన్న ఏపీ ఈగల్‌ చీఫ్‌ ఆకె రవికృష్ణ, అదనపు ఎస్పీ స్వరూపారాణి మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ప్రతిభ కనబరిచి కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నట్లు వివరించారు. మహిళల విభాగంలో అప్పా ఎస్పీ శోభామంజరి, స్వరూపా రాణిలు ఉమెన్‌ డబుల్‌ విభాగంలో రాణించి మరొక కాంస్య పతకాన్ని రాష్ట్ర ఖాతాలో వేశారని తెలియజేశారు. అఖిల భారత పోలీస్‌ టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌శాఖకు చెందిన అధికారులు రెండు పతకాలు సాధించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషమని హర్షం వ్యక్తం చేశారు. పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాకు ఏపీ ఈగల్‌ చీఫ్‌ రవికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం గురువారం 524.30 అడుగులకు చేరింది. ఈ నీరు 157.2340 టీఎంసీలకు సమానం. సాగర్‌ జలాశయం నుంచి ఎస్‌ఎల్‌బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలఅవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

రేపల్లె: గుంటూరు జీజీహెచ్‌ చికిత్స పొందుతూ తప్పించుకుని పరారైన రేపల్లె సబ్‌జైల్‌ రిమాండ్‌ ఖైదీ భీముడు అజిత్‌ కుమార్‌ ఘటనపై ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసినట్లు రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు గురువారం రాత్రి వెల్లడించారు. డీఐజీ, బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెడ్‌ కానిస్టేబుళ్లు వై.అంకమల్లేశ్వరరావు (నగరం), త్రిశూల్‌ ఫణి (చెరుకుపల్లి), కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు (రేపల్లె టౌన్‌), బి.చంద్రశేఖర్‌ (చోడాయపాలెం), బి. రవితేజ (భట్టిప్రోలు)లను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఖైదీ పరారీ ఘటనపై విచారణ కొనసాగుతోందని బాధ్యులపై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశముందని డీఎస్పీ స్పష్టం చేశారు.

వినుకొండ: ఓ యువకుడు బుధవారం రాత్రి త్రిపురాంతకంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి తన చేతివాటం ప్రదర్శించాడు. రూ. 4 లక్షల నగదు, బంగారంతో స్కూటీపై పరారయ్యాడు. కానీ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అసలు విషయం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం, చింతలచెరువు రైల్వే బ్రిడ్జి సమీపంలో తన ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడ్డాడు. అతని ముఖానికి, కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ దారిన వెళ్లే వారు వెంటనే 108 కి సమాచారం అందించారు. సిబ్బంది మహబూబ్‌ బాషా, నరేష్‌బాబులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేశారు. తన పేరు యెహోషువా అని, తమది కురిచేడు మండలంలోని కాటంవారిపల్లె గ్రామమని, తాము చాలా కాలం క్రితం విజయవాడ వెళ్లి స్థిరపడ్డామని 108 సిబ్బందికి క్షతగాత్రుడు సమాచారం ఇచ్చాడు. తాను బంధువుల ఇంట్లో శుభకార్యానికి త్రిపురాంతకం వెళ్లొస్తున్నట్లు తెలిపాడు. కాటంవారి పల్లె గ్రామ చరిత్రలో ఆ పేరుగల కుటుంబం లేదని స్థానికులు తెలిపారు. అయితే క్షతగాత్రుడు కావాలని తమ వివరాలు చెప్పకుండా దాటవేసినట్లు 108 సిబ్బందికి అర్థమైంది. క్షతగాత్రుడి వద్ద ఫోనులో నంబరు తీసి అతని భార్యకు కాల్‌ చేసి సమాచారం ఇచ్చారు. తన భర్త రూ.4 లక్షల నగదు, బంగారం తీసుకుని ఉడాయించాడని, బంధువుల ఇంట్లో శుభకార్యం జరుగుతుండం వాటిని తెచ్చాడని భార్య తెలిపింది. త్రిపురాంతకం నుంచి ఉడాయించగానే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయటంతో ఫోన్‌ నంబరు సిగ్నల్‌ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఎన్నికల హామీలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చినా తగిన సర్వీసులు లేకపోవడంతో వారికి అవస్థలు తప్పడం లేదు. సరైన కసరత్తు లేకుండా పథకాన్ని ప్రవేశపెట్టడంతో సమస్య నానాటికీ తీవ్రం అవుతోంది. మహిళలు పల్లె వెలుగు బస్సులలో ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారు. బస్టాండ్‌లో బయలుదేరుతున్నప్పుడే సీట్ల కోసం ఎగబడాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. అక్కడి నుంచే గుంటూరు నగరంలో కూడా బస్సులు ఆపడానికి వీల్లేకుండా నిండిపోతున్నారు. నగరంలోని ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు దొరక్క పురుషులు, ఉద్యోగులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

తెనాలి: స్థానిక మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3000, గరిష్ట ధర రూ.5200, మోడల్‌ ధర రూ.4000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 32.4206 టీఎంసీలు.

ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై నిత్యాన్నదానానికి ఉండవల్లికి చెందిన కొండా బాలప్రదీప్‌, విజయశాంతి దంపతులు రూ.1,00,116 విరాళమిచ్చారు.

గుంటూరులీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు గురువారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పారా లీగల్‌ వలంటీర్లకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌, మొదటి అదనపు జిల్లా జడ్జి వి.ఏ.ఎల్‌. సత్యవతి, పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.ఆర్‌.రాజీవ్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవతి మాట్లాడుతూ వలంటీర్స్‌ వారి విధులను తెలుసుకొని ప్రజలకు ఎలా సేవ చేయాలో వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ మాట్లాడుతూ పారా లీగల్‌ వలంటీర్స్‌ సమాజం పట్ల, ప్రజల పట్ల ఉండాల్సిన బాధ్యతను వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకోవడంతోపాటు వారికి న్యాయ సహాయం ఎలా అందించాలో తెలియజేశారు. ప్రజలకు అవగాన కల్పించడంలో ముందుండాలని తెలిపారు. పర్మినెంట్‌ లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ పి.ఆర్‌.రాజీవ్‌ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా న్యాయం పొందే విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. నల్సా పథకాలు, పారా లీగల్‌ వలంటీర్స్‌ విధులను వివరించారు. ప్యానెల్‌ అడ్వకేట్‌ కట్టా కాళిదాసు లీగల్‌ సర్వీసెస్‌ చట్టాలు, సివిల్‌ చట్టాలపై అవగాహన కలిగించారు. డెప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డెఫన్స్‌ కౌన్సెల్‌ ఐ. మధుబాబు క్రిమినల్‌ చట్టాల గురించి వివరించారు. సీనియర్‌ పారాలీగల్‌ వలంటీర్‌ షేక్‌ మొహమ్మద్‌ రఫీ సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement