నిత్యం బాధితుల పక్షం | - | Sakshi
Sakshi News home page

నిత్యం బాధితుల పక్షం

Apr 2 2026 7:47 AM | Updated on Apr 2 2026 7:47 AM

నిత్యం బాధితుల పక్షం ప్రధానికి మంత్రి నాదెండ్ల ధన్యవాదాలు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై చర్యలు తీసుకోవాలి 150 ఉద్యోగాలకు 7,500 దరఖాస్తులు గుంటూరు మెడికల్‌: పిగురాళ్ల ప్రభుత్వ గవర్నమెంట్‌ హాస్పటల్‌లో స్టాఫ్‌ నర్సు ఉద్యోగాలకు గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) కార్యాలయం అధికారులు గత నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చారు. 150 కాంట్రాక్టు ఉద్యోగాలకు మార్చి 31న ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ముసిగింది. మొత్తం 7,500 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీ డాక్టర్‌ జి.శోభరాణి తెలిపారు. ఈ నెలాఖరులోపు స్క్రూట్ని చేసి ఉద్యోగాలను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకా రం మెరిట్‌ ప్రాతిపదికన భర్తీ చేస్తామన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ఆర్డీవో తెలిపారు. వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

నెహ్రూనగర్‌: న్యాయం పక్షాన నిఖార్సుగా నిలబడే న్యాయవాది వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి అని శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం కొనియాడారు. ముచ్చటగా మూడోసారి రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులుగా నియమితులైన వట్టిజొన్నల బ్రహ్మారెడ్డికి వారు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం గుంటూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి కింది స్థాయి నుంచి కృషి, పట్టుదలతో తాను ఎంచుకున్న న్యాయ వ్యవస్థలో అంచెలంచెలుగా ఎదిగారని తెలిపారు. అక్రమ కేసులతో అధికార పక్షం గురి చేస్తున్న వేధింపుల నుంచి వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలకు ఉపశమనం కలిపించడంలో ఆయన పాత్ర కీలకమని వ్యాఖ్యనించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు గులాం రసూల్‌, పరిశపోగు శ్రీనివాసరావు, పానుగంటి చైతన్య, దూపాటి వంశీ, రబ్బానీ, రవి నాయుడు, గోపి యాదవ్‌, సమీర్‌ పాల్గొన్నారు.

తెనాలి అర్బన్‌: అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేందుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ప్రధాని మోదీకి మంత్రి నాదెండ్ల మనోహర్‌ ధన్యవాదాలు తెలిపారు. తెనాలిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధానిని నిర్మించేందుకు సీఎం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

తాడేపల్లిరూరల్‌(మంగళగిరి): రడగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు దొరికిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌పై అనర్హత వేటు వేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, రాజకీయాల నుంచి బహిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ కార్యదర్శి కనినిక బోస్‌ ఘోష్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి రూరల్‌ మండలం కొలనుకొండలోని ఐద్వా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఇటీవల డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డ ఎంపీ పుట్టా మహేష్‌కు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి రాజకీయ నాయకులకు ఒక న్యాయం... సామాన్యులకు మరో న్యాయం అన్నట్లుగా పోలీసులు వ్యవహరించారని బోస్‌ ఘోష్‌ విమర్శించారు. దేశంలో గంజాయి మాఫియాను అరికట్టేందు కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చే పట్టాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు కె.శ్రీదేవి, సీనియర్‌ నాయకురాళ్లు ఎస్‌.పుణ్యవతి, వై.సత్యవతి, డి.రమాదేవి, దొంతిరెడ్డి శ్రీనివాస్‌ కుమారి పాల్గొన్నారు.

గుంటూరు మెడికల్‌: వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాడ్పులు కారణంగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. తన కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో డాక్టర్‌ కొర్రా విజయలక్ష్మి మాట్లాడుతూ వడదెబ్బ లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. వేసవికాలంలో వడదెబ్బ బారిన పడడానికి అవకాశం ఉంటుందన్నారు. చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, వణుకు పుట్టడం, మగత నిద్ర లేదా కలవరింతలు, ఫిట్స్‌ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి వంటి లక్షణాలు ఏర్పడవచ్చని తెలిపారు. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే, నీరు, పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ లాంటి ద్రవరూప పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలని చెప్పారు. తెల్లని లేదా లేత వర్ణం గల తేలికై న కాటన్‌ దుస్తులు ధరించాలని సూచించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటివద్దనే ఉండాలన్నారు. అత్యవసరమై బయటికి వెళ్లవలసి వస్తే, గొడుగు లేదా టోపీ లేదా పల్చటి గుడ్డను తలకు చుట్టుకోవాలని, మాంసాహారం తగ్గించాలన్నారు. మద్యపానానికి దూరంగా ఉండాలని చెప్పారు. నలుపు, మందంగా ఉన్న దుస్తులు ధరించరాదన్నారు. తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలని, చిన్నపిల్లలు, గర్భిణీలు, బాలింతలు మెలకువగా ఉండాలన్నారు. ఓఆర్‌ఎస్‌ ప్యాకెటు ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వడదెబ్బ లక్షణాలు కనబడిన వెంటనే ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement