వసూళ్ల ‘అనారోగ్యం’ | - | Sakshi
Sakshi News home page

వసూళ్ల ‘అనారోగ్యం’

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

నెహ్రూనగర్‌ : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 57 డివిజన్లు ఉన్నాయి. వీటికి 57 శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు. నగరం మొత్తం మీద పర్మినెంట్‌, ఆప్కాస్‌, డైలీ వేజ్‌ కింద(రోజుకు రూ.500) పనిచేసే వారు 2 వేల మందికి పైగా ఉన్నారు. ప్రతి నెల కొన్ని శానిటరీ డివిజన్ల నుంచి రూ.10 వేలు వసూలు చేయాలని నిబంధన ఉండటంతో పర్మినెంట్‌ వర్కర్లు ఎవరైనా పనిచేయలేక మస్టర్‌ పలికి వెళ్లిపోతే వారి నుంచి నెలకు రూ.10వేలు, ఆప్కాస్‌ వర్కర్‌ ఎవరైనా చెప్పకుండా విధులకు గైర్హాజరైతే తిరిగి విధుల్లో తీసుకునేందుకు రూ.5 వేలకుపైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఇవ్వకపోతే కష్టాలే

శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అడిగినంత ఇవ్వకపోతే వర్కర్లకు ఇబ్బందులే. వారిని కష్టమైన పనులకు పురమాయించడంతోపాటు అన్ని పనులు వారే చేయాలన్నట్లు టార్గెట్‌ చేస్తారనే ఆరోపణలు లేకపోలేదు. ఇటీవల తూర్పు నియోజకవర్గంలో ఓ వర్కర్‌ డబ్బులు ఇవ్వలేదని తీవ్ర ఇబ్బందులు పెట్టడంతో అతడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం కూడా ఉంది.

అదనపు బాదుడు

ప్రతి నెల రూ.10 వేలతోపాటు అదనంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు, పలు అవసరాలకు సంబంధించి నగదును కూడా శానిటరీ వర్కర్ల నుంచే బాదేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కార్మికుల నుంచి దోచుకుంటున్న వారిపై చర్యలు చేపట్టాలని యూనియన్‌ నాయకులు కోరుతున్నారు. ప్రజారోగ్యంలో వసూళ్ల పర్వంపై సీఎంహెచ్‌ఓ శాంతికళను వివరణ కోరేందుకు ఫోన్‌ చేయగా స్పందించలేదు.

పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌

నెలకు రూ.10 వేలు ఇవ్వాల్సిందే

వారి నుంచి వసూలు చేస్తున్న

సూపర్‌వైజర్లు

తీసుకున్న డబ్బుల్లో

ఉన్నతాధికారులకు వాటాలు

ఇవ్వకపోతే సిబ్బందికి

తప్పని వేధింపులు

ప్రజారోగ్యంలో వసూల్‌ రాజాలు ఎక్కువైపోయారు. ఈ విభాగంలో ఓ ముఖ్య అధికారికి ప్రతి నెల పారిశుద్ధ్య ఇన్‌స్పెక్టర్‌ రూ.10 వేల చొప్పున ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. దీంతో చేసేదేమీ లేక ఇన్‌స్పెక్టర్లు కూడా పారిశుద్ధ్య కార్మికుల నుంచి డబ్బులు వసూలు చేసి సూపర్‌వైజర్లకు (ఎస్‌ఎస్‌) ఇస్తే అందులో సగం ఎస్‌ఎస్‌లు, సగం ప్రజారోగ్య విభాగంలోని ఓ ముఖ్య అధికారి తీసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement