వేలానికి ప్రతిబంధకాలు | - | Sakshi
Sakshi News home page

వేలానికి ప్రతిబంధకాలు

Mar 29 2026 7:20 AM | Updated on Mar 29 2026 7:20 AM

ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026 వేలానికి ప్రతిబంధకాలు కార్పొరేషన్‌ ఆదాయానికి గండి తాళాలు వీరి దగ్గరే..

న్యూస్‌రీల్‌

టీడీపీ నేతల చేతుల్లోనే...

నిమ్మకాయల ధరలు

పీఆర్కేను కలిసిన శ్యామల

సాగర్‌ నీటిమట్టం వివరాలు

గుంటూరు
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026

నెహ్రూనగర్‌: నగర పాలక సంస్థపై టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. నగరపాలక సంస్థకు చెందిన కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాల వేలం నిర్వహణను టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. తమ అనుచరుల ఆదాయానికి గండి పడనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. వేలం నిర్వహించేందుకు గతేడాది సెప్టెంబర్‌లో రెవెన్యూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. గతేడాది సెప్టెంబర్‌ 16న బహిరంగ వేలం నిర్వహిస్తారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్యాణమండపాలు టీడీపీ నేతల చేతుల్లో ఉన్నాయి. వీటికి వేలం పాట పెడితే ఎక్కడ వారి ఆదాయానికి గండి పడుతుందోనని ఎమ్మెల్యేలు వాటికి వేలం నిర్వహించకుండా నిలిపివేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కల్యాణ మండపం, మదర్‌థెరిస్సా కమ్యూనిటీ హాల్‌, కాపు కమ్యూనిటీ హాల్‌ (ఏసీ), లాల్‌జాన్‌ బాషా షాదీఖానాతో కలిపి మొత్తం నాలుగు ఉన్నాయి. ఇవి టీడీపీ నేతలు, కార్పొరేటర్ల చేతుల్లో ఉన్నాయి. వీటి ద్వారా భారీ స్థాయిలో వచ్చే ఆదాయాన్ని వారి జేబుల్లో వేసుకుని కార్పొరేషన్‌కు తూతూ మంత్రంగా అద్దె చెల్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీంతో కార్పొరేషన్‌ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. గత సంవత్సరం సెప్టెంబర్‌ నెలలో కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలకు వేలం నిర్వహించాలని ఉద్దేశించి ప్రకటన విడుదల చేశారు. సెప్టెంబర్‌ 20, 2025 నుంచి సెప్టెంబర్‌ 19, 2026 వరకు ఏడాది పాటు నిర్వహించేందుకుగాను చర్యలు చేపట్టారు. శ్రీకృష్ణ కల్యాణ మండపానికి రూ.3,53,510, మదర్‌థెరిస్సా కమ్యూనిటీ హాల్‌ రూ.3,51,450, కాపు కమ్యూనిటీ హాల్‌(ఏసీ)కి రూ.4,80,000, లాల్‌జాన్‌ బాషా షాదీఖానా రూ.1,50,000 చొప్పున సంవత్సరానికి అద్దె ఖరారు చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావడంతో వేలం నిర్వహణకు బ్రేక్‌ పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్‌ 16న నగరపాలక సంస్థకు స్వచ్ఛ భారత్‌ బృంద సభ్యులు గుంటూరుకు వస్తున్నారనే కారణంగా వాయిదా వేస్తున్నామని, తిరిగి వేలం నిర్వహణ తేదీలను ప్రకటిస్తామంటూ అధికారులు ప్రకటించారు. నెలలు గడుస్తున్నప్పటికీ ఇంత వరకు వేలంపై ఎటువంటి స్పందన లేదు.

కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలకు సంబంధించిన తాళాలు నగరపాలక సంస్థ సిబ్బంది వద్దే ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కానీ తాళాలు మాత్రం ఒకటి కార్పొరేషన్‌ సిబ్బంది వద్ద, మరొకటి తమ్ముళ్ల వద్దే ఉంచుకుని వారికి అవసరమైనప్పుడు అద్దెలకు ఇచ్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేక అధికారి పాలనలోనైనా కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాలకు కూడా వేలం పాట నిర్వహిస్తే కార్పొరేషన్‌ మరింత ఆదాయం సమకూరుతుందని నగర వాసులు అభిప్రాయపడుతున్నారు.

I

టీడీపీ నేతల చేతుల్లో కమ్యూనిటీ

హాళ్లు, కల్యాణ మండపాలు

వేలం నిర్వహణకు గతేడాది ప్రకటన

ఎమ్మెల్యేల ప్రోద్బలంతో నిలిపివేత?

నెలలు గడుస్తున్నా పట్టించుకోని

అధికారులు

శ్రీకృష్ణ కల్యాణ మండపం టీడీపీ మాజీ కార్పొరేటర్‌ చేతుల్లో ఉండగా, కాపు కమ్యూనిటీ హాల్‌, మదర్‌థెరిస్సా కమ్యూనిటీ హాల్‌ టీడీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయి. ఈ మూడింటికి నెలలకు లక్షల్లో ఆదాయం వస్తుంటే కార్పొరేషన్‌కు జమ అయ్యేది కేవలం వేలల్లోనే. ఈ మూడింటి తరపున ఎంతో కొంత నగదు జమ అవుతుంటే లాల్‌ జాన్‌బాషా షాదీఖానా ఎమ్మెల్యే సోదరుడు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని నుంచి నగరపాలక సంస్థకు తూతూ మంత్రంగా చిల్లర విదిలిస్తున్నట్లు నగరపాలక సంస్థ సిబ్బందే బహిరంగంగా చెబుతున్నారు. అధికారం మాదే కదా మేము ఎందుకు కట్టాలి అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

తెనాలి: తెనాలి మార్కెట్‌ యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్‌ ధర రూ.7,500 వరకు పలికింది.

మాచర్ల:వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా శనివారం కలిశారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 535.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి వచ్చే నీటిచేరిక పూర్తిగా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement